Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Jul-2017 12:05:52
facebook Twitter Googleplus
Photo

ఓ సినిమా పూర్తి చేశాక.. దానికి ఎలాంటి సర్టిఫికేట్ వచ్చినా గతంలో పెద్దగా వేరియేషన్ ఉండేది కాదు. మరీ అడల్ట్ కంటెంట్ మూవీస్ కి మినహాయిస్తే.. సాధారణ సినిమాలకు ఏ సర్టిఫికేట్ ఇచ్చినా.. పిల్లలను రానివ్వకుండా ఉండడం అనే సంస్కృతి.. సింగిల్ స్క్రీన్స్ లో లేదు. కానీ ఇప్పుడిది చాలా పెద్ద మ్యాటర్. ముఖ్యంగా ఏ క్లాస్ సెంటర్స్ ను ఆకట్టుకునే మూవీస్ కి అయితే.. సర్టిఫికేట్ చాలా ముఖ్యం. పిల్లలను రానివ్వకపోతే ఫ్యామిలీ ఆడియన్స్ దూరమయ్యే ఛాన్స్ ఉంది.

కానీ ఇలాంటి సమస్యలేవీ.. హీరో నానికి ఎప్పుడూ ఎదురుకావు. దాదాపుగా నాని నటించిన సినిమాలు అన్నిటికీ క్లీన్ యు సర్టిఫికేట్ వచ్చేస్తుంటుంది. నేను లోకల్ కు మాత్రం యు/ఏ వచ్చిందంతే. న్యాచురల్ స్టార్ లేటెస్ట్ మూవీ నిన్ను కోరి చిత్రానికి కూడా ఇప్పుడు సెన్సార్ పూర్తి చేసుకోగా.. ఈ మూవీకి కూడా యూ సర్టిఫికేట్ ఇచ్చేశాయి సెన్సార్ వర్గాలు. ఒక్క కట్ కూడా సూచించలేదని తెలుస్తోంది. ట్రయాంగ్యులర్ లవ్ స్టోరీగా తెరకెక్కిన నిన్ను కోరి మూవీతో.. శివ నిర్వాణ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కోన వెంకట్ రచయిత కావడం విశేషం.

నివేదా థామస్ హీరోయిన్ గా నటించిన నిన్ను కోరి చిత్రంలో.. ఆది పినిశెట్టి కీలక పాత్రలో కనిపించనున్నాడు. విశాఖ.. అమెరికా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్ర కథ నడుస్తుంది. జూలై 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్

,  ,  ,  ,  ,  ,