Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Sep-2016 12:08:07
facebook Twitter Googleplus
Photo

విక్టరీ వెంకటేష్ కొత్త సినిమా స్టార్ట్ చేసేయనున్నాడు. బాబు బంగారంతో సక్సెస్ కి దగ్గరగా వచ్చి ఆగిపోయిన వెంకీ.. ఈ సారి తనకు అచ్చొచ్చిన రీమేక్ తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. హిందీలో సూపర్ హిట్ అయిన సాలా ఖద్దూస్ ను వెంకటేష్ రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ ను డైరెక్ట్ చేసిన సుధ కొంగర ప్రసాద్ ఈ తెలుగు రీమేక్ కు కూడా దర్శకత్వం వహించనుంది.

ఇప్పుడు తెలుగు వెర్షన్ కు టైటిల్ ని ఫిక్స్ చేసేశారని తెలుస్తోంది. 'గురు' అనే టైటిల్ ని ఖాయం చేసే అవకాశాలున్నాయట. సినిమాలో వెంకటేష్ బాక్సింగ్ కోచ్ గా నచించనుండడంతో.. ఈ సినిమాకి గురు పర్ఫెక్ట్ టైటిల్ అని భావిస్తున్నారట యూనిట్. వెంకీ గురువుగా నటించే ఈ మూవీలో.. ఆయనకి శిష్యురాలిగా రితికా సింగ్ నటించనుంది. ఈ అమ్మాయికి ఇదే తొలి తెలుగు సినిమా కాగా.. ఒరిజినల్ వెర్షన్ లో కూడా ఈమే యాక్ట్ చేసింది. ఈ ఒక్క పాత్రతో హిందీ.. తమిళ్ తో పాటు తెలుగులోనూ రితికా సింగ్ అరంగేట్రం చేసేస్తుండడం విశేషం.

ప్రస్తుతం గురు చిత్రానికి సంబంధించి ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతుండగా.. త్వరలో పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రాజెక్టును అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. ఈ స్పోర్ట్స్ బేస్డ్ మూవీ పీవీపీ బ్యానర్ పై రూపొందనుంది.

,  ,  ,  ,  ,  ,