Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-May-2017 11:34:01
facebook Twitter Googleplus
Photo

యంగ్ హీరో నాని తెగ స్పీడ్ గా సినిమాలు చేసేస్తుంటాడు. ఈ ఏడాది ఇప్పటికే నేను లోకల్ తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టేసిన నాని.. ఇప్పుడు నిన్ను కోరి అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా.. ఈ మూవీలో మెజారిటీ పార్ట్ యూఎశ్ లో చిత్రీకరించడం విశేషం.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమాకు.. ప్రమోషన్ పనులు కూడా ప్రారంభించేశారు. తాజాగా నిన్నుకోరి చిత్రానికి ఓ 20 సెకన్ల టీజర్ రిలీజ్ చేశారు యూనిట్. బీచ్ ఒడ్డున హీరో నాని.. హీరోయిన్ నివేదా థామస్ లు కూర్చుని ఉంటే.. సముద్రంలోంచి అలలు వచ్చి వారి కాళ్లను ముద్దాడుతూ ఉంటాయి. ఆ సీన్ ని ఎంజాయ్ చేస్తుంటారు ప్రేమ జంట. చెప్పేందుకు సింపుల్ సీన్ అయినా దీన్ని పిక్చరైజ్ చేసిన విధానం బాగుంది. ఇంతకు మించి చెప్పుకోవాల్సిన విషయం.. ఆ సీన్ కు అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.

గోపీ సుందర్ అందించిన సంగీతం.. ప్రేమలోని మధుర భావాలను పంచుతుంది. ఆకట్టుకునే స్లో మోషన్ బీట్ తో కట్టిపడేశాడు సంగీత దర్శకుడు. ప్రేమ మత్తులో ముంచెత్తేసే 'అడిగా అడిగా' పాటకు ఇచ్చిన సంగీతం.. సినిమాకు స్పెషల్ అవుతుందని అంటున్నాడు నాని.

,  ,  ,  ,  ,