Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-May-2016 19:03:26
facebook Twitter Googleplus
Photo

ఈ ఏడాది బాలీవుడ్లో సర్ ప్రైజ్ సక్సెస్ అయిన సినిమాల్లో ?బాగి? పేరు ముందు చెప్పుకోవాలి. ట్రైలర్ చూసినప్పుడే ఇందులో ఫైట్లు తప్ప ఇంకేమీ లేవే అని పెదవి విరిచారు జనాలు. సినిమా కూడా ఆ అంచనాలకు తగ్గట్లే కనిపించింది. సినిమా నిండా ఫైట్లు తప్ప ఇంకేమీ లేదన్నారు చూసిన వాళ్లంతా. బాలీవుడ్ క్రిటిక్స్ అందరూ ఈ సినిమాను ఏకేశారు. చెత్త సినిమా అని తేల్చేశారు. కానీ కలెక్షన్లు చూస్తే ఇంకోలా ఉన్నాయి. ఫస్ట్ వీకెండ్లో బంపర్ ఓపెనింగ్స్ తెచ్చుకోవడడమే కాదు.. వీక్ డేస్ లో సైతం స్ట్రాంగ్ గా నిలబడింది బాగా. దాదాపు రూ.80 కోట్ల దాకా కలెక్ట్ చేసి ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది బాగి.

ఈ సంతోషంలో ఇటీవలే ముంబయిగా గ్రాండ్ సక్సెస్ పార్టీ అరేంజ్ చేశాడు నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా. ఈ సినిమాలో విలన్ పాత్ర చేసి ప్రశంసలందుకున్న మన సుధీర్ బాబు కూడా హాజరయ్యాడు. ఆ సందర్భంగా మీడియాలో సెంటరాఫ్ అట్రాక్షన్ అయ్యాడు సుధీర్. బోలెడంతమంది మీడియా ప్రతినిధులు వచ్చి అతడి మీద పడిపోయారు. ?బాగి?కి సీక్వెల్ వస్తోందంటున్నారు మరి మీరు అందులో ఉంటారా అని అడిగితే.. ??తొలి భాగంలోనే నన్ను చంపేశారుగా.. మరి సీక్వెల్లో నాకు ఛాన్స్ ఉండదేమో. ఏదైనా డైరెక్టర్ సాబిర్ ఖానే చెప్పాలి?? అన్నాడు సుధీర్.

?బాగి? విడుదలయ్యాక బాలీవుడ్లో ఆఫర్లు వస్తున్నాయా అని అడిగితే.. ??చాలానే వస్తున్నాయి. ఐతే విలన్ పాత్రలు కాకుండా హీరోగానే చేయమంటున్నారు. గోపీచంద్ మీద తీయబోయే బయోపిక్ హిందీ-తెలుగు భాషలు రెండింట్లోనూ తెరకెక్కుతుంది?? అని సుధీర్ వెల్లడించాడు.

,  ,  ,  ,  ,  ,