Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Sep-2016 12:18:03
facebook Twitter Googleplus
Photo

హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తూ కింగ్ అక్కినేని నాగార్జున నిర్మలా కాన్వెంట్ అనే ఆసక్తికర టైటిల్‌తో ఓ టీనేజ్ లవ్‌స్టోరీని నిర్మించిన విషయం విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపుగా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుందని టీమ్ స్పష్టం చేసింది. ఈ సినిమాకు సంబంధించి కొద్దిరోజుల క్రితం విడుదలైన పాటలు, టీజర్ మంచి ఆసక్తి రేకెత్తిస్తోండగా సినిమాను మరింతగా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్ళేలా నాగార్జున ప్లాన్ చేస్తున్నారు.
నాగార్జున ఈ సినిమాను తక్కువ బడ్జెట్‌తోనే నిర్మించినా ప్రమోషన్స్ విషయంలో మాత్రం మొదట్నుంచీ సినిమాకు మంచి క్రేజ్ తెచ్చారు. నాగార్జున స్వయంగా ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు. నాగ కోటేశ్వర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఏ.ఆర్.రహమాన్ తనయుడు అమీన్ ఓ పాట పాటడం సినిమాకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది

,  ,  ,  ,  ,  ,