తెలుగు అమ్మాయి అయినప్పటికీ తమిళ్లో సక్సెస్ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతుంది శ్రీదివ్య. అయితే ఇంతవరకు కేవలం ప్రధాన పాత్రలలో నటించిన ఈ అమ్మడికి ఇప్పుడు సెకండ్ హీరోయిన్ ఛాన్స్ లు వస్తున్నాయట. అందుకు ప్రధాన కారణం కార్తీ సినిమా ?కాశ్మోరా?లో ఆమె సెకండ్ హీరోయిన్ అని ప్రచారం జరగడమే.?కాశ్మోరా?లో కార్తీ సరసన నయనతార, శ్రీదివ్య, మనీషా యాదవ్ నటిస్తున్నారు. ఇందులో శ్రీదివ్య సెకండ్ హీరోయిన్ అంటూ పుకార్లు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఖండించింది శ్రీదివ్య. ?కాశ్మోరాలో తాను సెకండ్ హీరోయిన్ కాదని, ఆ మూవీలో కార్తీ నే త్రిపాత్రాభినయంలో నటిస్తున్నాడని, అందులో అతడి ఒక పాత్ర సరసన తాను నటిస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా తనను సెకండ్ హీరోయిన్ అంటే ఒప్పుకునేది లేదని, అలాంటి పాత్రలు కూడా తాను చేయనని? ఆఫర్లను తిరస్కరిస్తోందట.
Sridivya, Not, Accepting, SecondHeroine, ROles, Matter,