Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Sep-2017 11:40:53
facebook Twitter Googleplus
Photo

సినిమా పరిశ్రమలో ఒకే కుటుంబానికి చెందిన వారు చాలామంది ఉంటారు. కానీ హీరోయిన్స్ కుటుంబానికి చెందినవారు కొంచెం తక్కువగానే ఉంటారని చెప్పాలి ముఖ్యంగా హీరోయిన్స్ సిస్టర్స్ అయితే అప్పుడప్పుడు వెండితెరపై కనిపిస్తూ ఉంటారు. కానీ అందరు అనుకున్నంత రేంజ్ లో స్టార్ హోదాను అందుకోలేకపోతారు.

అయితే టాలీవుడ్ చందమామ కాజల్ చెల్లి నిషా అగర్వాల్ కొన్నేళ్లు టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరిక్షించుకున్న సంగతి తెలిసిందే. అమ్మడి అందానికి ఓ వర్గం ప్రేక్షకులు బాగానే ఆకర్షితులు అయ్యారు. కానీ సినిమాల్లో మాత్రం ఎక్కువ కాలం నిలవలేకపోయింది. ఏమైంది ఈ వేళ- సోలో వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకొని టాలీవుడ్ తెరపై అలరించింది. అయితే అమ్మడు 2013 లో అక్క కాజల్ కంటే ముందే పెళ్లి చేసుకుంది. ముంబై కి చెందిన కరణ్ అనే వ్యాపారవేత్త తో మ్యారేజ్ లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది. ఇన్ని రోజులు ప్రేమ పక్షుల్లా తిరిగిన ఈ జంట ఇక పిల్ల పాపలతో ఉండడానికి సిద్ధమైంది.

ఇక అసలు విషయానికి వస్తే నిషా అగర్వాల్ కాజల్ ని త్వరలోనే పెద్దమ్మను చేయబోతోందట. మొన్నటివరకు ఈ వార్త రూమర్స్ అనే విధంగా చెలరేగాయి. కానీ ఫైనల్ గా నిషా అది నిజమేనని మరి కొన్ని రోజులో మా బంధంలోకి కొత్త ప్రాణం రాబోతోందని నిషా తెలిపింది.

,  ,  ,  ,