Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Jun-2016 12:45:49
facebook Twitter Googleplus
Photo

త్రివిక్రమ్ పెన్నులోని కమ్మదనం.. సమంత అందాల్లోని మసాలా.. నితిన్ కొత్తరకం నటనలోని తీపి.. కథలోని పులపు.. కామెడీలోని వగరు.. క్యారెక్టర్లలోని కారం.. వెరసి ''అ..ఆ'' సినిమాను ప్రేక్షకులకు నచ్చే రుచికరమైన వంటకంగా మార్చేశాయి. ఇంకేముంది.. సినిమా మీది ఎంజాయ్ మెంట్ మాది అన్నట్లు.. ఆడియన్స్ ధియేటర్లకు బారులు తీస్తున్నారు.

మిక్సడ్ హైప్ తో జనాల ముందుకు రావడం.. ఇప్పుడు అ..ఆ సినిమాకు పెద్ద ప్లస్ అయిపోయింది. రిలీజ్ రోజున కాస్త మిక్సడ్ టాక్ ఉన్నా కూడా.. సాయంత్రానికి పాజిటివ్ టాక్ మాత్రం రాకెట్ లా దూసుకుపోయి.. నెగెటివ్ టాకేమో చిచ్చుబుడ్డిలా రెండు నిమిషాల్లో మాయమైంది. దానితో తొలిరోజు సినిమాకు ఏకంగా 8.78 కోట్ల 'షేర్' వసూలైంది. కేవలం తెలుగు రాష్ట్రంలలోనే 5.55 కోట్లు షేర్ రాగా.. అమెరికా నుండి 2 కోట్లు.. తక్కిన ప్రాంతాల నుండి 1.2 కోట్లు షేర్ వచ్చేసింది. ఇదంతా మాంత్రికుడు త్రివిక్రమ్ మహిమే అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇకపోతే త్రివిక్రమ్ కు.. నితిన్ కు.. నయా పైసా కూడా ఇవ్వకుండా ''అ..ఆ'' బడ్జెట్ 40 కోట్లు అయ్యిందట. దాని గురించి గుర్తుపెట్టుకోండి.. మనం మళ్ళీ మాట్లాడుకుందాం

,  ,  ,  ,