Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Apr-2016 12:19:34
facebook Twitter Googleplus
Photo

త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ సమంత జంటగా నటించిన మూవీ ?అ..ఆ..?. ఇప్పుడీ చిత్రానికి ఆడియో రిలీజ్ డేట్ ఫైనల్ చేశారు. ఈ నెల 26న పాటలను విడుదల చేయనున్నట్లు.. ప్రకటించారు. ఆడియో రిలీజ్ పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది యూనిట్.

ఏప్రిల్ 26న ఆడియో వచ్చినా.. గతంలో అనుకుంటున్నట్లుగా మే 6న అ..ఆ.. రిలీజ్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అదే రోజన సూర్య 24 వస్తుండడంతో.. ఆ డేట్ ని ఫిక్స్ చేయకపోవచ్చు. ఇక ఆ తర్వాతి వారం మే 13న మహేష్ బాబు బ్రహ్మోత్సవం రిలీజ్ కానుంది. సూర్య సినిమానే సింగిల్ గా వదిలేసినపుడు... మహేష్ కి పోటీగా నితిన్ రాకపోవచ్చు. అంటే.. ఆల్మోస్ట్ ఆ డేట్ కూడా వదిలేసినట్లే.

ఇక అ..ఆ.. మూవీని మే 20న కానీ 27న కానీ విడుదల చేసేందుకు అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఈ సమ్మర్ మరీ దారుణంగా ఉండడంతో.. ఇప్పటికే జూన్ 14 వరకూ హాలిడేస్ అనౌన్స్ చేసేశారు. అందుకే మే చివరివారానికే త్రివిక్రమ్ ఫిక్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

,  ,  ,  ,  ,  ,  ,