Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Oct-2015 18:29:22
facebook Twitter Googleplus
Photo

త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఈ మాటల మాంత్రికుడి సినిమాల్లో మాటలు ఎంత పదునుగా ఉంటాయో.. ఫైట్స్ కూడా అంతే పవర్ ఫుల్ గా ఉంటాయి. ఆయన భాషలో చెప్పాలంటే.. వయలెన్స్ ని సైలెన్స్ గానే చించేస్తాడు త్రివిక్రమ్. ప్రస్తుతం నితిన్ సమంత జంటగా త్రివిక్రమ్ తీస్తున్న చిత్రం అ..ఆ.. ఈ మూవీలో నితిన్ పాత్ర పేరు ఆనంద్ విహారి. ఈయన రౌడీలను ఉతికి ఆరేసే పనిలో ఉన్నాడిపుడు. నిజానికి కేరక్టర్ ప్రకారం ఆనంద్ విహారి మంచి కుర్రాడే అయినా.. తన జోలికి వస్తే ఎవరినీ వదిలే బాపతు కాదు. ఓ రోజు స్నేహితులతో రోడ్డు మీద వెళ్తుంటే నితిన్ కి రౌడీలు ఎదురుపడ్డారు.

అంతకు ముందు సీన్ లో రౌడీలను నితిన్ రప్ఫాడించించడంతో... మరింతమందిని వేసుకుని చుట్టుముట్టేశారు. అంటే తన్నులాటకి ఫాలోఅప్ అన్నమాట. అయినా మనోడు హీరో కదా. అందులోనూ కుర్ర హీరో. అందుకే ఎంతమంది ఎదురొచ్చినా.. ఎగిరెగిరి మరీ ఫట్ ఫట్ లాడించేస్తున్నాడు. ఎన్నిసార్లు విలన్లు రౌడీలు ఎదురైనా.. హీరో కాబట్టి ఆటోమేటిగ్గానే ఇరగదీసేస్తాడు. ఫైట్ మాస్టర్ రవి వర్మ నేతృత్వంలో ఈ పైటింగ్ సీన్ చిత్రీకరణ జరుగుతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న అ..ఆ.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

2016 ఫిబ్రవరి 14 ఈ మూవీ విడుదలకు సన్నాహాలు చేసుకుంటున్నాడు మాటల మాంత్రికుడు. సమంత హీరోయిన్ అయినా.. స్టోరీ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంటుంది. తన కెరీర్ మొత్తానికి త్రివిక్రం అత్యంత వేగంగా షూట్ చేస్తున్న మూవీ ఇదే.

,  ,  ,  ,