Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Oct-2016 11:11:45
facebook Twitter Googleplus
Photo

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ అ..ఆ.. అంటూ భారీ సక్సెస్ నే కొట్టాడు. మీడియం రేంజ్ హీరోగా సెటిల్డ్ ప్లేస్ లో ఉన్న నితిన్.. టాప్ హీరోలకు మాత్రమే సాధ్యమైన 50కోట్ల షేర్ వసూళ్లను అధిగమించాడు. తన తర్వాతి మూవీ ఈ స్థాయిని పెంచకపోయినా.. కనీసం కాపాడేటట్లయినా ఉండాలనే ఉద్దేశ్యంతో.. ప్రాజెక్టు ఎంపికలో ఎంతో కేర్ తీసుకుని.. చివరకు హను రాఘవపూడికి ఓకే చెప్పాడు నితిన్.

హను-నితిన్ ల ప్రాజెక్టుకి ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ చేసేయగా.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ఊపందుకున్నాయి. హీరోయిన్ తో పాటు ఇతర నటీ నటులు - టెక్నికల్ టీమ్ లను ఎంపిక చేసుకుంటూ ఉండగా.. మరోవైపు లొకేషన్స్ కోసం వేట మొదలైపోయింది. ఈ సినిమాలో దాదాపు 90శాతం ఫారిన్ లోనే పిక్చరైజ్ చేసేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. యూఎస్ఏ లో కానీ.. యూరోప్ దేశాల్లో కానీ తీయాలనే ఉద్దేశ్యంతో.. ఇప్పటికే లొకేషన్స్ ను ఫైనల్ చేసే పనిలో పడ్డారని తెలుస్తోంది.

నవంబర్ లో నితిన్ సినిమా షూటింగ్ మొదలు కానుండగా.. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఫినిష్ చేసి.. సమ్మర్ చివర్లో విడుదల చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది కూడా అ..ఆ.. అదే టైమ్ లో రిలీజ్ కాగా.. మళ్లీ సరిగ్గా ఏడాదికి నితిన్ మూవీ థియేటర్లలోకి వస్తుందన్న మాట.

,  ,  ,  ,  ,