Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Oct-2016 16:56:34
facebook Twitter Googleplus
Photo

మెగాస్టార్ చిరంజీవిని మళ్లీ వెండితెర మీద చూసుకోవడానికి ఇంకో వంద రోజులు వెయిట్ చేస్తే చాలు. 2017 జనవరి 13న చిరు రీఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ ఆరంభమైన రోజు నుంచి చిరు ఈ సినిమా కోసం నిర్విరామంగా పని చేస్తూ వస్తున్నాడు. ఈ మధ్యే మీలో ఎవరు కోటీశ్వరుడు షో కోసమని గ్యాప్ తీసుకున్నాడు. ఈ సందర్భంగా ?ఖైదీ నెంబర్ 150? ప్రోగ్రెస్ గురించి ఈ సినిమా నిర్మాత.. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ మీడియాకు కొంచెం సమాచారం అందించాడు. సినిమా చాలా బాగా వస్తోందంటూ అతను ఆనందం వ్యక్తం చేశాడు.

70 శాతానికి పైగా షూటింగ్ పూర్తయిందని చెప్పిన చరణ్.. చిరంజీవి ఈ సినిమా కోసం డబ్బింగ్ కూడా మొదలుపెట్టినట్లు వెల్లడించాడు. ఔట్ పుట్ చాలా బాగా వస్తోందని.. సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంటుగా ఉన్నామని.. సంక్రాంతి కానుకగా ?ఖైదీ నెంబర్ 150? ప్రేక్షకుల్ని పలకరించడం ఖాయమని చరణ్ తెలిపాడు. విడుదలకు నెల రోజుల ముందే సినిమా పూర్తయిపోతుందని చరణ్ ధీమా వ్యక్తం చేశాడు. ఈ సినిమా కోసం చరణ్ ?కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ? పేరుతో కొత్త బేనర్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నందిస్తున్నాడు. రత్నవేలు ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. చిరు సరసన కాజల్ నటిస్తోంది. తమిళ బ్లాక్ బస్టర్ ?కత్తి?కి ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే.

,  ,  ,  ,  ,