Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Apr-2016 14:09:48
facebook Twitter Googleplus
Photo

దర్శకుడు త్రివిక్రమ్, హీరో నితిన్‌ల క్రేజీ కాంబినేషన్‌లో అ..ఆ.. పేరుతో ఓ ఆసక్తికర రొమాంటిక్ కామెడీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ సినిమాను వచ్చేనెల 6న ప్రేక్షకులకు ముందుకు తెచ్చేలా టీమ్ కృషి చేస్తోంది. ఓ పక్క షూటింగ్ పూర్తి చేస్తూనే, మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తూ ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు. తాజాగా నితిన్ తన డబ్బింగ్ పార్ట్‌ను నేటినుంచి మొదలుపెట్టేశారు.
నితిన్ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి అన్న ఆసక్తికర టైటిల్ పెట్టే అంచనాలను పెంచేసిన త్రివిక్రమ్, ఈమధ్యే విడుదల చేసిన పోస్టర్‌తో సినిమా ఎలా ఉండనుందో పరిచయం చేశారు. ఇక ఈ ఫస్ట్‌లుక్‌కి వచ్చిన రెస్పాన్స్‍తో రెట్టించిన ఉత్సాహంతో టీమ్ సినిమాను పూర్తి చేస్తోంది. హరికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,  ,