Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Sep-2016 15:29:14
facebook Twitter Googleplus
Photo

తను ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్లను పరిచయం చేసినా.. ఇప్పుడు తనకు జోడీగా నటించేందుకు హీరోయిన్ ని వెతకడం కష్టంగానే ఉందని.. విక్టరీ వెంకటేష్ ఈ మధ్య ఓపెన్ గానే చెప్పేశాడు. సీనియర్లతో నటించేందుకు హీరోయిన్స్ అంతా సంకోచిస్తున్న టైమ్ లో.. వెంకీతో జోడీ కట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నిత్యామీనన్ అందరినీ ఆశ్చర్యపరిచింది. కిషోర్ తిరుమల డైరెక్షన్ లో 'ఆడాళ్లూ.. మీకు జోహార్లు' టైటిల్ పై తెరకెక్కనున్న మూవీలో నిత్యామీనన్ పాత్ర కీలకంగా ఉండనుందని తెలుస్తోంది.

ఏజ్ బార్ అయిన హీరోతో కుర్ర బ్యూటీ రొమాన్స్.. ఈ మూవీకి హైలైట్ గా నిలవనుందనే టాక్ వినిపిస్తోంది. నిజానికి ఇలాంటి కాన్సెప్ట్ ని వెంకీ ఓసారి మనకి చూపించేశాడు. ఆడవారి మాటలకు అర్ధాలే వేరులో చిత్రంలో.. కాసేపు ఉండే స్వాతి పాత్ర విపరీతంగా అలరిస్తుంది. వెంకీ-స్వాతి కాంబినేషన్ లో వచ్చే సీన్స్ కడుపుబ్బ నవ్వించేస్తాయి. ఇప్పుడు ఇదే టైపు సీన్లను సినిమా అంతా నింపనున్నారట.

ఎక్కువ వయసున్న హీరో- యంగ్ హీరోయిన్ కాంబినేషన్ లో కామెడీ వచ్చే కామెడీనే.. ఆడాళ్లూ మీకు జోహార్లుకు మెయిన్ అట్రాక్షన్ కానుందని తెలుస్తోంది. ఈ కామెడీ సీన్స్ నచ్చడంతోనే.. అటు వెంకీ.. ఇటు నిత్యామీనన్ లు సెకండ్ థాట్ లేకుండా ఓకే చెప్పేశారట. మళ్లీ ఆ రేంజ్ కామెడీ పండిస్తే మాత్రం.. సినిమా ఇరగదీసేయడం ఖాయమే.

,  ,  ,  ,  ,  ,