Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Nov-2017 13:09:13
facebook Twitter Googleplus
Photo

దర్శకుడు తను ఎటువంటి సినిమాను తెరకెక్కించిన ప్రతి సినిమాలో ఎక్కడో ఒక చోట తన మార్క్ ఉండేలా చూసుకుంటాడు. కానీ తీసిన ప్రతి సినిమా సినిమాకి సంబంధం లేకుండా ఉండదు. ఎక్కడో ఒక చోట టచ్ అవుతూనే ఉంటుంది. కానీ ఈ రోజుల్లో యువ దర్శకులు అలా ఉండకుండా చూసుకుంటున్నారు. ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమకంటే డిఫరెంట్ గా సినిమాని తియ్యాలని అనుకుంటున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రవీణ్ సత్తారు ఆ విధంగానే చేస్తున్నాడు. కొత్తగా కథలను ఎంచుకుంటున్నడు. ఇటీవల పిఎస్వీ గరుడవేగ తో మంచి హిట్ అందుకున్న ఈ దర్శకుడు మొత్తం ఐదు సినిమాలను తీశాడు. అందులో చందమామ కథలు - రొటీన్ లవ్ స్టార్ మంచి గుర్తింపు దక్కించుకున్నాయి. ఇక వినూత్నంగా తెరకెక్కిన గుంటూరు టాకీస్ ఏ స్థాయిలో హల్చల్ చేసిందో అందరికి తెలిసిందే. ఇక రీసెంట్ గా రాజశేఖర్ తో కరెక్ట్ సినిమా తీసి కరెక్ట్ హిట్ అందుకున్నాడు. అయితే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా ప్రవీణ్ కొత్త కాన్సెప్ట్ లను రెడీ చేసుకుంటున్నాడట.

ప్రస్తుతం గరుడవేగ అందరికీ నచ్చడంతో కొంత మంది హీరోలు ఈ దర్శకుడి వైపు చూస్తున్నారు. అయితే ఇప్పటికే ప్రవీణ్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపిచంద్ బయోపిక్ తీస్తాను అని అనౌన్స్ చేశాడు. కానీ ఇది మొదలు పెట్టె ముందు నితిన్ తో మరో మూవీ తియ్యాలని ప్లాన్ చేస్తున్నాడట. ఆ సినిమా నితిన్ హోమ్ ప్రొడక్షన్ లోనే రానుందని సమాచారం.

,  ,  ,  ,  ,