Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Oct-2016 11:02:20
facebook Twitter Googleplus
Photo

నారా రోహిత్ లాంగ్ డిలేయ్డ్ మూవీ ?శంకర?కు ఎట్టకేలకు మోక్షం కలిగినట్లే. ఈ శుక్రవారమే ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఎప్పుడో నాలుగేళ్ల ముందు మొదలై.. మధ్యలో రెండేళ్లు అడ్రస్ లేకుండా పోయిన ?శంకర?.. ఈ మధ్యే వార్తల్లోకి వచ్చింది. గత నెల 16నే రావాల్సిన ఈ సినిమా అనుకోకుండా వాయిదా పడింది. మళ్లీ ఈ నెల 21కి కొత్తగా రిలీజ్ డేట్ ఇచ్చారు. కానీ మధ్యలో ప్రమోషన్ హడావుడి ఏమీ లేకపోవడంతో ఈ సినిమా మళ్లీ వాయిదా పడుతుందేమో అన్న సందేహాలు కలిగాయి. ఐతే ఆ సందేహాలకు తెరదించుతూ రిలీజ్ డేట్ కన్ఫమ్ చేసింది ?శంకర? బృందం.

?శంకర? గురించి పట్టించుకోనట్లుగా ఉన్న నారా రోహిత్ కూడా ఈ సినిమా కోసం కదిలాడు. దర్శక నిర్మాతలతో కలిసి ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఈ శుక్రవారం ?శంకర? రిలీజ్ కాబోతున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది. మరోవైపు బుక్ మై షోలో బుకింగ్స్ కూడా మొదలయ్యాయి కాబట్టి.. ఈసారి సినిమా విడుదలవడం పక్కా అని భావించవచ్చు. తమిళ హిట్ మూవీ ?మౌనగురు?కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం నారా రోహిత్ సరసన రెజీనా కథానాయికగా నటించింది. భీమలి కబడ్డీ జట్టు.. ఎస్ ఎంఎస్ లాంటి సినిమాలు తీసిన తాతినేని సత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. చంద్రమౌళి నిర్మించగా.. సాయికార్తీక్ సంగీతాన్నందించాడు. మరి మొదలైన నాలుగేళ్లకు విడుదల కాబోతున్న ?శంకర? ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి.

,  ,  ,  ,  ,  ,