Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Jun-2017 10:30:34
facebook Twitter Googleplus
Photo

యంగ్ హీరో నాని ఎవరికైనా ఇట్టే కనెక్ట్ అయిపోతాడు. నేచురల్ అని పిలిపించుకుంటున్నా సరే డౌన్ టు ఎర్త్ బిహేవియర్.. నానిని మరో రేంజ్ కు తీసుకెళ్లపోతుంది. తాజాగా ఈ హీరో తన కొడుకు అర్జున్ తో కలిసి దిగిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

నెల రోజుల చిన్ని బుజ్జాయితో ఫోటో దిగి.. ఆ పిక్చర్ ను అభిమానులతో పంచుకోవడంతో.. బోలెడన్ని రియాక్షన్స్ వచ్చాయి. బోలెడన్ని అభినందనలు రాగా.. ఒక హీరోయిన్ నుంచి మాత్రం డిఫరెంట్ గా స్పందన వచ్చింది. జెంటిల్మన్ మూవీలో నానికి జోడీగా నటించిన నివేదా థామస్.. నాని-కొడుకు అర్జున్ ల ఫోటోకి పప్పు అని కామెంట్ పెట్టింది. ఈ కామెంట్ కి ఎలా రియాక్ట్ కావాలో అర్ధం కాని నాని.. క్లారిటీ కోసం తన స్టైల్ లో పప్పూ కిస్ కో బోలారే అంటూ ప్రశ్నించాడు. ఆ తర్వాతే అసలు సిసలైన రియాక్షన్ వచ్చింది.

అర్జున్ వాళ్ల నాన్నని పప్పు అన్నా.. మై కుట్టన్'(కుట్టన్ అంటే మలయాళంలో ఆత్మీయులను పిలుచుకునే ముద్దు పేరు) అనేసింది నివేదా థామస్.

,  ,  ,  ,  ,