ఇప్పుడు 'లింగా' సినిమాకు, 'ఐ' సినిమాకు అన్నిట్లోనూ పోటీ పడింది. ముఖ్యంగా ధియేటర్ల విషయంలో 'లింగా'ను శంకర్ సినిమా అధిగమిస్తోంది. రజనీకాంత్ నటించిన 'లింగా' చిత్రం విదేశాల్లో 300 ధియేటర్లలో రిలీజై, రికార్డు సృష్టిస్తే, ఇప్పుడు 'ఐ' దానిని బ్రేక్ చేస్తోంది. ఈ సినిమా తమిళ, తెలుగు, హిందీ వెర్షన్లు మూడూ కలిపి సుమారు 450 స్క్రీన్స్ పై రిలీజవుతున్నాయి. 'లింగా' సినిమా బాక్సాఫీసు వద్ద ఫెయిలవడంతో ఇప్పుడు అందరి కళ్ళూ ఇక శంకర్ సినిమాపైనే కేంద్రీకృతమయ్యాయి. సంక్రాంతికి విడుదలవుతున్న ఈ చిత్రంలో విక్రం, ఎమీ జాక్సన్ జంటగా నటించిన సంగతి విదితమే!
shankar, i, vikram, arrehman, 30thdec, audio, lingaa,