Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Apr-2017 12:43:29
facebook Twitter Googleplus
Photo

జనతా గ్యారేజ్ సక్సెస్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ జై లవ కుశ. ఇప్పటికే ఓ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకోవడమే కాదు.. టైటిల్ లోగో లుక్ కూడా విడుదల చేసేశారు. అయితే.. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నా.. ఇప్పటివరకూ అఫీషియల్ గా మాత్రం రాశి ఖన్నా ఒక్క పేరునే ప్రకటించారు.

జై లవ కుశలో హీరోయిన్ అంటూ పలు పేర్లు వినిపించినా.. తన నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఏ విషయాన్ని నమ్మద్దని చెప్పాడు నిర్మాత కళ్యాణ్ రామ్. అలాగే మూవీకి సంబంధించిన అప్ డేట్స్ ను కూడా తనే సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేస్తున్నాడు. ఇప్పుడు జై లవ కుశలో రెండో హీరోయిన్ పేరును కూడా చెప్పేశాడు కళ్యాణ్ రామ్. నాని మూవీ జంటిల్మన్ చిత్రంతో టాలీవుడ్ ఆడియన్స్ ను ఆకట్టుకున్న నివేదా థామస్.. ఎన్టీఆర్ తో కలిసి అడిపాడడం కన్ఫాం అయింది.

ఇప్పటికే పలు మార్లు ఈమె పేరు వినిపించినా.. కళ్యాణ్ రామ్ అధికారికంగా ప్రకటించడంతో.. ఎన్టీఆర్- నివేదల జోడీ ఖాయమైందన్న మాట. ప్రస్తుతం హైద్రాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర యూనిట్ తో.. త్వరలోనే జత కానుంది నివేదా.

,  ,  ,  ,  ,  ,