Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Feb-2017 12:34:49
facebook Twitter Googleplus
Photo

స్వీటీ అనుష్కపై ఇప్పుడు సోషల్ మీడియాలో చాలానే జోకులు పేలుతున్నాయి. రెండేళ్ల క్రితం వరకూ తన అందాలతో ఆకట్టుకున్న అనుష్క.. సైజ్ జీరో చిత్రం కోసం లావుగా మారి మరీ సినిమా కోసం కష్టపడింది. ఆ సినిమా ఆశించిన పేరు తెచ్చిపెట్టలేదు కానీ.. అనుష్కను మాత్రం లావుగా మార్చేసింది.

ఆ తర్వాత స్లిమ్ గా మారేందుకు స్వీటీ చేసిన ప్రయత్నాలు పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో కాసింత భారీ శరీరంతోనే సినిమాలు చేసేస్తోంది అనుష్క. సింగం3 లాంటి సినిమాల ట్రైలర్స్ లో లావుగానే కనిపించిన ఈ బ్యూటీ.. రీసెంట్ గా బాహుబలి2 చిత్రానికి రిపబ్లిక్ డే రోజున ఇచ్చిన పోస్టర్ లో మాత్రం స్లిమ్ లుక్ తో సూపర్బ్ గా అలరించింది. అనుష్క ఇంత సన్నగా మారిపోయిందా అనే సందేహాలు వచ్చినా.. అదంతా విజువల్ ఎఫెక్ట్స్ మహిమ అనే విషయం అందరికీ అర్ధమైంది. దీంతో 'అతి తక్కువ సమయంలో స్లిమ్ గా మారాలంటే ఏం చేయాలో తెలుసా.. గ్రాఫిక్స్ ను ఆశ్రయిస్తే సరి' అంటూ జోకులు పేలుస్తున్నారు.

కానీ బాహుబలి టీం కానీ.. అనుష్క కానీ.. ఇలాంటి కామెంట్స్ కు ఏ మాత్రం రియాక్ట్ కావడం లేదు. అసలు పట్టించుకున్నట్లుగా కూడా కనిపించడం లేదు. టెక్నాలజీ పుణ్యమా అని.. ఎలా కావాలంటే అలా చూపించే వెసులుబాటు ఉంది. పైగా ట్యాలెంట్ విషయంలో అమ్మడికి వంకలు చెప్పడానికి ఛాన్స్ ఉండదు. అందుకే ఇలాంటి విమర్శలను లైట్ తీసుకుంటోంది స్వీటీ.

,  ,  ,  ,  ,  ,