Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Oct-2015 17:30:56
facebook Twitter Googleplus
Photo

ఓ ఏడాది క్రితం తెలుగు మాస్ జనాలకు బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి పెద్దగా తెలీదు. కానీ టెంపర్ లో మొదలైంది ఈ సెక్సీ సుందరి టాలీవుడ్ ప్రయాణం. వైజాగ్ సన్నీలియోన్ గా పరిచయమయ్యి.. ఇట్టాగా రెచ్చిపోదాం అంటూ ఓ ఊపు ఊపేసింది. అమ్మడి అందాలు - వయ్యారాలు తెలుగోళ్లని బాగానే ఆకట్టుకోవడంతో.. తర్వాత కూడా ఛాన్సులు వరుసగానే వచ్చాయి.

ఏకంగా బాహుబలిలోనూ ఐటెం సాంగ్ లో చిందులేసింది నోరా ఫతేహి. తర్వాత కిక్2 లోనూ రవితేజ పక్కన కదం తొక్కింది. ఇప్పుడు కళ్యాణ్ రామ్ సరసన షేర్ లోనూ పూరీ డైరెక్షన్ లో లోఫర్ లో మరోసారి కనిపించబోతోంది నోరా.

సెక్సీ బ్యూటీ అని పిలవడం ఐటెం గాళ్ అనిపించుకోవడం కాంప్లిమెంట్ అంటోంది నోరా. అదో క్రెడిట్ అనీ తను ఎంత అందంగా ఆకర్షణీయంగా ఉందో జనాలు చెబ్తున్నారని అంటున్నారని చెబుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ ఆఫర్స్ ఈ అమ్మడి చేతిలో చాలానే ఉన్నాయి. అయితే.. అన్నీ సినిమాలు ముఖ్యమే అయినా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ మహేష్ బాబుల పక్కన నటించాలన్నది నోరా టార్గెట్.

,  ,  ,  ,