Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Nov-2016 10:50:25
facebook Twitter Googleplus
Photo

పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో పది రోజులుగా ఉక్కిరి బిక్కిరి అవుతోంది సినీ పరిశ్రమ. ఆ నిర్ణయం వెలువడ్డ మరుసటి రోజుకే థియేటర్లపై తీవ్ర ప్రభావం పడింది. జేబుల్లో చెల్లే నోట్లు బాగా తగ్గిపోవడంతో జనాలు థియేటర్ల వైపు చూడటానికే భయపడ్డారు. దీంతో థియేటర్లు వెలవెలబోయాయి. కలెక్షన్లు బాగా పడిపోయాయి. జనాలు లేక షోలు క్యాన్సిల్ చేయాల్సిన.. థియేటర్లే మూసేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో గత శుక్రవారం వచ్చిన కొత్త సినిమా ?సాహసం శ్వాసగా సాగిపో? చిత్రానికి ఓపెనింగ్స్ అనుకున్న స్థాయిలో రాలేదు. ?ప్రేమమ్? లాంటి సూపర్ హిట్ తర్వాత చైతూ నటించిన సినిమా అయినా.. గౌతమ్ మీనన్-చైతూ కాంబినేషన్ కు మంచి క్రేజ్ ఉన్నా.. కలెక్షన్లు అనుకున్నంతగా రాలేదు. హౌస్ ఫుల్ కలెక్షన్లతో కళకళలాడాల్సిన కొత్త సినిమా.. సగం.. ముప్పావుశాతం ఆక్యుపెన్సీతో నడించింది. కొన్ని చోట్ల ఈ మాత్రం కూడా కలెక్షన్లు కనిపించలేదు. ఆ సినిమాకు యావరేజ్ టాక్ రావడం కూడా ఒక కారణం.

ఐతే వారం గడిచేసరికి ఇప్పుడు పరిస్థితి మారింది. ఈ శుక్రవారం విడుదలైన ?ఎక్కడికి పోతావు చిన్నవాడా? మాత్రం జనాల్ని బాగానే థియేటర్లకు రప్పించింది. జనాల చేతికి వంద నోట్లు బాగానే వచ్చాయి. వేరే పనులపై.. వినోదం మీద దృష్టిపెడుతున్నారు జనాలు. దీనికి తోడు ?ఎక్కడికి పోతావు చిన్నవాడా? కు మంచి క్రేజ్ ఉండటం.. ఫుల్ పాజిటివ్ టాక్ రావడం కూడా కలిసొచ్చింది. సాయంత్రానికి చాలా చోట్ల హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఇటు మల్టీప్లెక్సులు.. అటు సింగిల్ స్క్రీన్లు రెండు చోట్లా హౌస్ ఫుల్స్ పడ్డాయి. పాజిటివ్ టాక్ అంతకంతకూ పెరుగుతుండటంతో శని.. ఆదివారాల్లో పరిస్థితి మరింత మెరుగవుతుందని.. ఈ చిత్రం కలెక్షన్లు బాగానే కొల్లగొడుతుందని భావిస్తున్నారు.

,  ,  ,