Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Sep-2017 11:07:48
facebook Twitter Googleplus
Photo

ఎన్టీఆర్ ఇప్పుడు కెరీర్ లోనే టాప్ ఫాంలో ఉన్నాడు. ఎన్టీఆర్ కు సక్సెస్ లు కొత్తేమీ కాదు కానీ.. టెంపర్ నుంచి ప్రతీ సినిమా హిట్ చేసుకోవడమే కాదు.. రేంజ్ కూడా పెంచుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇప్పుడు జై లవ కుశ మూవీతో 100 కోట్ల షేర్ మార్క్ ను ఈజీగా అందుకుంటాడనే అంచనాలున్నాయి.

ఈ రేర్ ఫీట్ ను సుసాధ్యం చేసేందుకు గాను.. శాయశక్తులా కృషి చేస్తున్నాడు జూనియర్. ఈ సందర్భంగా ఇంటర్వ్యూల్లో .. తన జూనియర్ కి సంబంధించిన టాపిక్ వస్తే మాత్రం తనే తెగ ఎమోషనల్ అయిపోతున్నాడు యంగ్ టైగర్. కొడుకు అభయ్ రామ్ గురించి అడిగితే.. ఆపకుండా తెగ చెప్పేస్తున్నాడు. అసలు అభయ్ నుంచి తాను ఎన్నో నేర్చుకున్నానని కూడా అనేస్తున్నాడు ఎన్టీఆర్. మొదటిసారి తన బిడ్డ ఓ రూమ్ లో ఉండగా ఎత్తుకునేందుకు వెళ్లి.. తాను ఎవరో చెప్పేందుకు ప్రయత్నించానని.. తండ్రిని అడి వాడికి అర్ధం అయేలా చెప్పేందుకు చూశానని అన్నాడు ఎన్టీఆర్.

అయితే.. ఆ బిడ్డ మాత్రం అదేమీ పట్టించుకోకుండా తనకు తాను ఆడుకోవడం గమనించాడట. అప్పుడే తనకు సంబంధించిన ఫీలింగ్స్ అన్నీ పక్కన పెట్టి వాడి దగ్గరకు వెళ్లాలని తెలుసుకున్నాడట ఎన్టీఆర్.

,  ,  ,  ,