Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Jun-2016 12:43:58
facebook Twitter Googleplus
Photo

ఎప్పుడూ హీరోల రికార్డుల గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. అలా కాదంటే అప్పుడప్పుడూ దర్శకుల పేర్లు వినిపిస్తుంటాయి. అంతే తప్ప హీరోయిన్ల రికార్డుల గురించి మాట్లాడే నాథుడే ఉండడు. మనదంతా హీరో స్వామ్య పరిశ్రమ కాబట్టి.. కలెక్షన్లు.. రికార్డుల మాటెత్తితే హీరోయిన్ల ప్రస్తావన రాదు. అలాగని వాళ్లను పూర్తిగా తీసి పడేయలేం. హీరోల్లాగా తమకంటూ ఓ ఇమేజ్.. ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ల విషయంలో అయినా వారికి కొంచెం క్రెడిట్ ఇవ్వాలి. కనీసం అందరినీ కాకపోయినా సమంత లాంటి వాళ్లను మాత్రం కచ్చితంగా గుర్తించి తీరాలి. ?అఆ? సినిమా తొలి రోజు థియేటర్లలోకి వెళ్లి చూస్తే.. తెరమీద నితిన్ కనిపించినప్పుడు వినిపించిన కేకలే.. సమంత దర్శనం జరిగినపుడూ వినిపించాయి. ఇంకా చెప్పాలంటే సమంతను చూసినపుడు సౌండ్ కొంచెం ఎక్కువే ఉండుంటుంది. అదీ ఆమె ఫాలోయింగ్.

మొన్న ?బ్రహ్మోత్సవం? అమెరికాలో మిలియన్ డాలర్ క్లబ్బులోకి అడుగుపెడితే.. ఆరుసార్లు ఈ ఘనత సాధించాడంటూ మహేష్ ను ఆకాశానికెత్తేశారు. ఐతే అమెరికాలో సమంత హీరోయిన్ గా నటించిన 10 సినిమాలు మిలియన్ డాలర్ క్లబ్బులో చేరాయని చాలామందికి తెలియదు. ఈగ.. దూకుడు.. అత్తారింటికి దారేది.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. మనం.. సన్నాఫ్ సత్యమూర్తి.. బ్రహ్మోత్సవం.. అలా.. ఇవే కాక తమిళ సినిమాలు 24.. తెరి కూడా మిలియన్ డాలర్ క్లబ్బులో అడుగుపెట్టాయి. బాలీవుడ్ హీరోయిన్లకు సైతం ఈ రికార్డు లేకపోవడం విశేషం. మరోవైపు నైజాంలో 10 కోట్ల షేర్ మార్కు దాటిన సినిమాల్లో ఏడింట్లో సమంత హీరోయిన్ కావడం విశేషం. దూకుడు.. ఈగ.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. అత్తారింటికి దారేది.. మనం.. సన్నాఫ్ సత్యమూర్తి.. లేటెస్టుగా ?అఆ? కూడా ఈ జాబితాలో చేరాయి. హీరోల్లో ఎవరికీ కూడా ఈ రికార్డు లేదు. ఈ లిస్టులో ఉన్న సినిమాలన్నీ తెలుగు రాష్ట్రాల్లో.. అమెరికాలో మరెన్నో రికార్డులు సాధించాయి. అవన్నీ కూడా సమంత క్రెడిట్లోకి వెయ్యాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ?సమంత రికార్డులు? అంటూ ఓ స్పెషల్ బుక్కే వేయాల్సిన అవసరం వస్తుందేమో.

,  ,  ,  ,  ,  ,