Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Jul-2017 13:49:03
facebook Twitter Googleplus
Photo

హిందీ ఇంగ్లిష్ లో బాగా పాపులరైన బిగ్ బాస్ ప్రోగ్రాం మొదటిసారిగా తెలుగులో చేయబోతున్నారు. 12 మంది సెలబ్రిటీలు 60 కెమెరాల మధ్య 70 రోజుల పాటు ఒకే ఇంటిలో కలిసి ఉండటమే బిగ్ బాస్ కాన్సెప్ట్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదటిసారిగా ఓ టీవీ ప్రోగ్రాంకు హోస్ట్ చేస్తున్నాడు. ఈ ప్రోగ్రాంకు సంబంధించిన ప్రోమోలు ఇప్పటికే మా టీవీలో టెలికాస్ట్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈనెల 16 నుంచి బిగ్ బాస్ షో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎన్టీఆర్ ఈ ప్రోగ్రాంకు సంబంధించిన విశేషాలను స్వయంగా వెల్లడించాడు.

బిగ్ బాస్ లో 12 మంది సెలబ్రిటీలు ఉంటారని అందరికీ తెలిసిందే. అయితే వారెవరో నాకూ తెలియదు. ఆ 12 మంది ఎవరని నేనూ మా టీవీ వాళ్లను అడుగుతున్నా. పక్కవాళ్ల జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఈ షోకు ఇంత పాపులారిటీ రావడానికి అదే కారణం. ఈ షో కచ్చితంగా తెలుగు వాళ్లను ఆకట్టుకుంటుంది. ఎందుకంటే తెలుగు వాళ్ల తీరుతెన్నులకు అనుగుణంగా ఈ ప్రోగ్రాం తయారవుతోంది. శని - ఆదివారాల్లో మాత్రమే నేను బిగ్ బాస్ హౌస్ లో ఉంటా. వారంలో మిగతా రోజులు జై లవకుశ షూటింగ్ లో పాల్గొంటాను. షూటింగ్ షెడ్యూళ్లు ముందే ప్లాన్ చేసినవి. వాటిలో ఎలాంటి మార్పూ ఉండదు. ఈ షో నాలో ఫన్ యాంగిల్ ను మీకు పరిచయం చేస్తుంది. ఈ షో చేయడానికి నాకు రెమ్యునరేషన్ బాగానే ఇచ్చారు. కానీ అది మీరు అనుకునేంత కాదు అంటూ ఎన్టీఆర్ ఈ షో విశేషాలు చెప్పాడు.

తాతగారు నందమూరి తారక రామారావు జీవితగాథతో వచ్చే సినిమాలో ఎన్టీఆర్ పాత్రంలో బాబాయ్ బాలకృష్ణను చూడాలని కోరుకుంటున్నా. నేను ఎంతో ఆత్రంగా వెయిట్ చేస్తున్నా. ఆ సినిమాలో నేనేదైనా పాత్ర పోషించే ఐడియా ప్రస్తుతానికైతే లేదు. బిగ్ బాస్ షోలో ప్రేక్షకులు నా నుంచి ఏం కోరుకుంటున్నారో అవన్నీ ఉంటాయి. హిందీ బిగ్ బాస్ నేనెప్పుడూ చూడలేదు. మా కజిన్ సిస్టర్ తరచూ చూస్తుంటుంది. తను చెబితేనే ఈ షో గురించి తెలిసింది. తెలుగులో నేను హోస్ట్ చేస్తున్నానని తెలిసి ఎంతో ఎక్సైట్ అయింది. ఈ షో కోసం నేను ప్రత్యేకంగా ప్రిపేర్ అయింది ఏమీ లేదు. ఇంట్లో ఉన్నట్టే బిగ్ బాస్ హౌస్ లో ఉంటా. హోస్ట్ గా వేరే వాళ్లను అనుకరించను. నా ముద్ర కనిపించేలా చూసుకుంటా అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.

,  ,  ,  ,  ,  ,