Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Jul-2017 10:58:25
facebook Twitter Googleplus
Photo

తెలుగు బిగ్ బాస్ పై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ రియాల్టీ షోలో పాల్గొనే పార్టిసిపెంట్స్ గురించి తెగ చర్చలు జరిగిపోతున్నాయి. ఇప్పటివరకూ పలువురు సెలబ్రిటీల పేర్లు వినిపించినా.. వారంతా తాము బిగ్ బాస్ లో పాల్గొనడం లేదని చెప్పేశారు.

అయితే.. జూలై 16 నుంచి బిగ్ బాస్ కార్యక్రమం టెలికాస్ట్ కానుంది. తెలుగు బిగ్ బాస్ కోసం ఇప్పటికే 12మంది కంటెస్టెంట్స్ ను ఎంపిక చేసేసుకున్నారట ఛానల్ యాజమాన్యం. మొదటి రోజున టెలికాస్ట్ సమయంలో ఈ సెలబ్రిటీలను చూపించి.. ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పటివరకూ పార్టిసిపెంట్స్ పేర్లను అనౌన్స్ చేయలేదట. అయితే.. తెలుగమ్మాయి తేజస్వి మదివాడ ఇప్పటికే బిగ్ బాస్ కోసం ప్రిపేర్ అయిపోతోందని టాక్ వినిపిస్తోంది. ఈ విషయాన్ని తేజస్వి కన్ఫాం చేయలేదు కానీ.. బిగ్ బాస్ లో కనిపించే 12మంది పార్టిసిపెంట్స్ లో తేజస్వి ఒకరు అని తెలుస్తోంది.

మొత్తం 70 రోజుల పాటు ముంబై సమీపంలోని లోనావాలాలో ఉన్న బిగ్ బాస్ హౌస్ లోనే.. పార్టిసిపెంట్స్ అందరూ ఉండాలి. సోషల్ మీడియాపై బోలెడంత మక్కువ ఉన్న తేజస్వి.. ఇప్పుడు అన్నిటినీ పక్కన పెట్టేసి.. బిగ్ బాస్ కోసం రెండు నెలలకు పైగా గడిపేయాల్సి ఉంటుందన్న మాట.

,  ,  ,  ,  ,  ,