Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Dec-2015 18:09:05
facebook Twitter Googleplus
Photo

నందమూరి హీరోల సంక్రాంతి రేస్ రంజుగా మారిపోయింది. ముందు అనుకున్నదయితే ఓ వారం గ్యాప్ లో బాలయ్య డిక్టేటర్ - జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో చిత్రాలు రిలీజ్ అవ్వాల్సి ఉంది. ఇప్పుడా గ్యాప్ ఒక రోజుకు తగ్గిపోయింది. సుకుమార్ ఎన్టీఆర్ ల చిత్రాన్ని జనవరి 8న రిలీజ్ చేస్తామని మొదట ప్రకటించారు. ప్రస్తుతం యంగ్ టైగర్ అండ్ టీం మొత్తం స్పెయిన్ లో చక్కర్లు కొడుతున్నారు. హీరో ఎన్టీఆర్ జగపతి బాబు - తాగుబోతు రమేష్ సహా.. పలు కీలక పాత్రలకు సంబంధించిన సీన్స్ పిక్చరైజ్ చేస్తున్నారు.

ఇక్కడ షూటింగ్ ప్రోగ్రెస్ తెలుసుకున్న నిర్మాత బీవీఎస్ ఎన్ ప్రసాద్.. డిస్ట్రిబ్యూటర్లకు ఓ న్యూస్ అందించాడు. అదే.. జనవరి 13న నాన్నకు ప్రేమతో రిలీజ్ చేయబోతున్నామని ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ కి తగినంత సమయం ఉండడంతో.. ఈ డేట్ కి ఫిక్స్ అయిపోవచ్చని చెప్పేశాడు. దీంతో వీళ్ల గుండెళ్లో రైళ్లు పరిగెట్టడం మొదలుపెట్టాయి. ఇప్పటికే బాలకృష్ణ డిక్టేటర్ టీం నుంచి వాళ్లకు న్యూస్ వచ్చేసింది. టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయిందని కేవలం ఒక పాట మాత్రమే బ్యాలెన్స్ అని డిక్టేటర్ డైరెక్టర్ కం ఒక ప్రొడ్యూసర్ అయిన శ్రీవాస్ చెప్పేశాడు. దాన్ని కూడా ఫినిష్ చేసేసి.. జనవరి 14న రిలీజ్ చేయబోతున్నట్లు వివరించాడు. అంటే ఇప్పుడు బాలయ్య - ఎన్టీఆర్ ల సినిమాల రిలీజ్ కి ఒక రోజే గ్యాప్ అయిపోయింది. ఒక వారం గ్యాప్ లో విడుదల వద్దనే మొత్తుకుంటుంటే.. ఒక రోజు తేడాలో రెండు నందమూరి సినిమాలు రిలీజ్ చేయాల్సి రావడం.. వాళ్లకు తలనొప్పి తెచ్చిపెడుతోంది.

వాళ్లలో వాళ్లు చర్చించుకుని.. ఎవరికీ నష్టం లేకుండా రిలీజ్ చేయాలని.. మరీ మరీ కోరుతున్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఏమైనా రిలీజ్ కి మరో నెలన్నర ఉండడంతో.. ఎవరో ఒకరు తగ్గుతారని ఆశలు పెట్టుకున్నారు. అంటే నందమూరి అభిమానుల ఆనందానికి ఆ ఒక్క రోజు గ్యాప్ అనేది అడ్డం పడుతోందన్న మాట. మరి బాలయ్య - ఎన్టీఆర్ లలో ఎవరు తగ్గుతారో క్లారిటీ కోసం.. తుపాకీ అప్ డేట్స్ ఫాలో అవుతూ ఉండండి.

,  ,  ,  ,  ,