Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Jun-2016 10:50:57
facebook Twitter Googleplus
Photo

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన ?కబాలి? కోసం అభిమానులంతా ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ?విక్రమ సింహ?, ?లింగ? లాంటి రెండు పరాజయాల తర్వాత రజనీ ఈ సినిమాతో ఎలాగైనా పెద్ద హిట్ కొడతారని మొదట్నుంచీ ప్రచారం జరగడంతో ?కబాలి?పై అభిమానులంతా భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇక అభిమానులందరినీ సంతృప్తిపరచే స్థాయిలోనే సినిమా ఉండనుందని టీజర్‌, ఆడియోతో ఇప్పటికే స్పష్టమైంది. ఈ టీజర్ విడుదల తర్వాత అభిమానుల ఉత్సాహం మరింత పెరిగింది.
ఇక ఆ ఉత్సాహంతోనే జూలై 1న సినిమా విడుదలవుతుందని ఎదురుచూస్తే, అదికాస్తా జూలై 15కు వాయిదా పడింది. దీంతో కాస్త నిరుత్సాహపడ్డ అభిమానులకు తాజాగా అందుతోన్న ఓ సమాచారం మరింత నిరుత్సాహపరుస్తోంది. తమిళ సినీ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు కబాలి జూలై 15న కూడా విడుదల కాదని తెలుస్తోంది. జూలై 29న సినిమా విడుదయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అయితే టీమ్ దగ్గర్నుంచి ఈ విషయమై ఇంకా స్పష్టమైన ప్రకటన ఏదీ రాలేదు.
రేపు (జూన్ 29న) సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోనుంది. ఆ తర్వాత ఓ ప్రెస్‌మీట్ ద్వారా విడుదల తేదీపై దర్శక, నిర్మాతలు ఓ స్పష్టతనిచ్చే అవకాశం కనిపిస్తోంది. పా రంజిత్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమాను కళైపులి థాను నిర్మించారు.

,  ,  ,  ,  ,  ,  ,