Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Jun-2017 10:20:05
facebook Twitter Googleplus
Photo

ఏదైనా కార్యక్రమం సక్సెస్ అవాలంటే.. దాన్ని నిర్వహించే వాళ్లు ఎంత ముఖ్యమో.. పార్టిసిపేట్ చేసేవాళ్లు కూడా అంతే ముఖ్యం. ఒకరిద్దరు నామ్ కే వాస్తే పార్టిసిపెంట్స్ ఉన్నా.. హోస్ట్ లు తమ ట్యాలెంట్ తో లాగించేస్తారు.

కానీ మెజారిటీ పార్టిసిపెంట్స్.. జనాల్లో అంతగా ఇంట్రెస్ట్ లేని వారిని తీసుకొస్తే ఎలా ఉంటుందో.. ఇప్పుడు తమిళ్ బిగ్ బాస్ ప్రూవ్ చేసింది. సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ కార్యక్రమాన్ని లోకల్ లాంగ్వేజెస్ కూడా నిర్వహిస్తూ.. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ కు.. తమిళ్ లో కమల్ హాసన్ కు ఈ బాధ్యతలు అప్పగించారు. తెలుగు వెర్షన్ ఇంకా టీజర్ ల దగ్గరే ఉంది కానీ.. కమల్ హోస్ట్ చేస్తున్న తమిళ్ బిగ్ బాస్.. ఇప్పటికే తొలి షో కూడా పడిపోయింది. అయితే.. దీనికి వచ్చిన స్పందన నామమాత్రమే కావడం.. అందరినీ ఆశ్చర్యపరిచింది.

కమల్ హాసన్ లాంటి లెజెండ్ నిర్వహిస్తున్న కార్యక్రమానికి టీఆర్పీలు ఇంత దారుణంగా ఉండడానికి కారణమేంటో అంతు చిక్కడం లేదని తెగ మాట్లాడేసుకుంటున్నారు కోలీవుడ్ జనాలు. అయితే.. ఈ కార్యక్రమంలో.. నమిత.. గణేష్ వెంకట్రామన్.. గాయత్రి మినహాయిస్తే.. మిగిలినవారెవరూ చెప్పుకోదగ్గ గుర్తింపు ఉన్న ఆర్టిస్టులు కాదు. అదే ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ పై కూడా అనుమానాలు పెంచుతోంది. తెలుగులో సెలబ్రిటీలు అంతా బిగ్ బాస్ కి నో అనేస్తున్నారు. ఆఖరికి సెలబ్రిటీల పిల్లలకు కూడా ఆంక్షలు వస్తున్నాయి.

,  ,  ,  ,  ,