Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-May-2015 10:33:25
facebook Twitter Googleplus
Photo

తమిళ హీరో అజిత్ మంచి వంటగాడు. అతని చేతివంటకు చాలా మంది ఫ్యాన్స్ కూడా వున్నారు. అందులోను ఆయన బిర్యానీ వండితే అంతా లొట్టలేసుకుని తినాల్సిందే. అంతటి టేస్టీగా ఉంటుందట! అప్పుడప్పుడు తన షూటింగుల్లో తన స్పెషల్ బిర్యానీ వండి అందరికీ వడ్డిస్తుంటాడు. తాజాగా ఆ రుచిని అందాలభామ శ్రుతి హాసన్ కూడా ఆస్వాదించింది. ప్రస్తుతం ఈ చిన్నది అజిత్ తో కలసి 'అచ్చమిల్లై' అనే సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా షూటింగులో మన హీరో బిర్యానీ వండి ఆమెకు రుచి చూపించాడట. ఈ విషయం గురించి శ్రుతి చెబుతూ, "అజిత్ సార్ అద్భుతమైన వ్యక్తే కాదు, అద్భుతమైన కుక్ కూడా" అంటూ ట్వీట్ చేసింది.

,  ,  ,  ,  ,