Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Jan-2017 11:49:11
facebook Twitter Googleplus
Photo

జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా పట్టాలెక్కేస్తోంది. పవర్-సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాల దర్శకుడు బాబీతో.. ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ ఖాయమైపోగా.. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు ఫుల్ జోష్ లో సాగుతున్నాయి. టెంపర్.. నాన్నకు ప్రేమతో.. జనతా గ్యారేజ్ మూవీలను పెద్ద డైరెక్టర్లతో తీసి పెద్ద పెద్ద హిట్స్ కొట్టిన ఎన్టీఆర్.. బాబీతో సినిమా చేస్తాడని ఎవరూ ఊహించలేదు. దటీజ్ ఎన్టీఆర్ స్పెషాలిటీ అనిపించేలా తను మూడు పాత్రల్లో కనిపించే ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాడు.

బాబీ మూవీ తర్వాత త్రివిక్రమ్ తో సినిమాపై కూడా ఇప్పటికే అనౌన్స్ మెంట్ వచ్చేసింది. అలాగే ఎన్టీఆర్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వచ్చేసరికి.. ఫ్యాన్స్ మదిలో ఎప్పుడూ అదుర్స్ కి సీక్వెల్ మెదులుతూ ఉంటుంది. అలాగే దాన వీర శూర కర్ణను రీమేక్ చేయాలనే ఆలోచన ఎన్టీఆర్ కు ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెండు ప్రాజెక్టులు పక్కన పెట్టేసినట్లే అంటున్నారు. ముఖ్యంగా అదుర్స్2 విషయంలో అయితే.. అందరూ ఇంట్రెస్టింగ్ గా ఉన్నా కథ దొరకాల్సి ఉంటుంది.

ప్రస్తుతం యంగ్ టైగర్-వక్కంతం వంశీలకు అంతగా పొసగడం లేదు. అందుకే అదుర్స్ 2 కథ దొరకడం కష్టం. పైగా వినాయక్ కూడా ఈ కథ ఎందుకో ఇంకా సెట్ అవ్వలేదని చెప్పేశాడు. అలాగే దాన వీర శూర కర్ణ రీమేక్ కూడా ఇప్పట్లో సాధ్యం కాదనే టాక్ వినిపిస్తోంది. దీనిపై వివి వినాయక్ ఏమంటున్నాడంటే.. అసలు మైథాలజీ సినిమాలను చూసే ఆడియన్స్ మారిపోయారు అలాగే ఆ సినిమాలకు బడ్జెట్ కూడా భారీగా అవుతుంది. అవన్నీ చూసుకుంటే ఇప్పుడు ఆ ప్రాజెక్టు మెటీరియలైజ్ చేయడం చాలా కష్టం అన్నాడు. ఎన్టీఆర్ ఈ రెండు సినిమాలను చేస్తే చూడాలని సంబరపడ్డ అభిమానులకు.. ఇది నిరుత్సాహం కలిగించే విషయమే. అయితే ఎన్టీఆర్ అండ్ ఫ్యాన్స్ చిరకాల కోరికలను ఎవరు తీరుస్తారో?

,  ,  ,  ,  ,