Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Sep-2015 13:28:53
facebook Twitter Googleplus
Photo

ఈమధ్య సినిమా టైటిళ్లపై డిస్కషన్ లు ఎక్కువవుతున్నాయి. ప్రేక్షకుల ముందుకొచ్చేలోపు తక్కువలో తక్కువగా ఒక్కో సినిమాకి నాలుగైదు టైటిళ్లయినా ప్రచారమవుతుంటాయి. రామ్ చరణ్ సినిమాకి సంబంధించి ఎన్ని టైటిళ్లు బయటికొచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చివరికి యూనిట్ అనుకొన్నట్టుగానే `బ్రూస్ లీ` అనే పేరు ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకీ అలా బోలెడన్ని పేర్లు ప్రచారమవుతున్నాయి. నిన్నటికి నిన్న `అభిరామ్` అన్న పేరు వినిపించింది. సినిమాలో ఎన్టీఆర్ ఇంటర్ పోల్ ఆఫీసర్ అభిరామ్ అనే పాత్రలో కనిపించబోతున్నాడట. అభిరామ్ అన్న పేరును కూడా ఎన్టీఆర్ తనయుడు అభయ్ రామ్ పేరు నుంచి స్ఫూర్తి పొంది తీసుకొన్నదట. అందుకే ఆ పేరునే ఫిక్స్ చేస్తారని కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. సినిమా నిర్మాత భోగవల్లి ప్రసాద్ `అభిరామ్` అనే టైటిల్ ని ఛాంబర్ లో నమోదు చేయించడంతో ఇక ఎన్టీఆర్ సినిమాకి ఆ పేరు ఖరారైనట్టే అని మాట్లాడుకొన్నారంతా. ఆ విషయం ఎన్టీఆర్ చెవిన కూడా పడిందట. ఎన్టీఆర్ మాత్రం మన సినిమాకి `నాన్నకు ప్రేమతో` అనే టైటిలే కరెక్టనీ అది మార్చే ఉద్దేశం లేదని అభిమానులతో చెప్పాడట. దీంతో టైటిళ్ల గురించి ప్రచారానికి తెరపడినట్టయింది.

ఇటీవలే లండన్ లో కీలక షెడ్యూల్ పూర్తి చేసుకొని తిరిగొచ్చింది ఎన్టీఆర్ టీమ్. ఒక నెలపాటు కుటుంబంతో గడిపాక ఎన్టీఆర్ కొత్త షెడ్యూల్ కోసం రంగంలోకి దిగుతాడు. హైదరాబాద్ తో పాటు మళ్లీ లండన్ లోనూ సన్నివేశాల్ని తెరకెక్కించాల్సి వుందట. సినిమాని శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే సగానికిపైగా చిత్రీకరణ పూర్తయిందట. ఇక మిగిలి వున్న పార్ట్ని కూడా తొందరగా ఫినిష్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాలపై దృష్టిపెట్టాలని సుక్కు భావిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ జనవరి 8న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాత చెబుతున్నాడు. ఎన్టీఆర్ రకుల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

,  ,  ,  ,  ,