Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Sep-2017 14:18:08
facebook Twitter Googleplus
Photo

జై లవకుశ చాలా స్పెషల్ అని చెప్పాలి. మొదటి సారి భారీ బడ్జెట్ సినిమా తియ్యడమే కాదు మొదటి సారి భారీ హిట్ ను అందుకోవడానికి పరుగులు తీస్తున్నాడు ఎన్టీఆర్. జై లవకుశ అనుకున్నట్టుగానే తారక్ సినిమాల్లో మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆయన గత చిత్రాల విజయాలు ఈ సినిమా మార్కెట్ కి బాగా ఉపయోగపడ్డాయి. సినిమా కథాంశం కూడా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చడంతో మంచి కలెక్షన్స్ ని సాధించింది.

ఈ సినిమా గతవారం రిలీజ్ అయ్యింది. మొదటి రోజే ఉహించని వసూళ్ళను అందుకున్న ఎన్టీఆర్. ఆరు రోజులకే 100 కోట్ల మార్క్ ను అందుకున్నాడు. నిన్నటి వరకు వచ్చిన కలెక్షన్స్ తో మొత్తానికి తారక్ వంద కోట్ల బిజినెస్ హీరోగా నిరూపించుకున్నాడు. ఫస్ట్ వీక్ సెలవులు సినిమాకు బాగా ఉపయోగపడ్డాయని చెప్పవచ్చు. దానికి తోడు పాజిటివ్ టాక్ కూడా రావడంతో జై లవకుశ కలెక్షన్స్ లో ఏ మాత్రం తగ్గలేదు. ఎన్టీఆర్ సోలో పర్ఫామెన్స్ గా చెప్పుకునే త్రిపాత్రాభినయం సినిమాకి ప్రధాన హైలెట్ గా నిలిచింది. పాత్రలో ప్రాణం పెట్టి నటించడం తో అభిమానులు సినిమాను రెండవసారి చూడటానికి కూడా వెళుతున్నారు.

ముఖ్యంగా బిసి సెంటర్స్ లో నందమూరి వారసుడు ఊహించిన దానికంటే ఎక్కువ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అందుకున్నాడు. కొన్ని ఏరియాల్లో బాహుబలి తర్వాత ఆ స్థాయి కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా జై లవకుశ నిలిచింది. బయ్యర్స్ కి కూడా మంచి లాబలనే అందించింది. ఇక ఈ రోజు స్పైడర్ సినిమా రిలీజ్ అయ్యింది. ఒక వేళ ఆ సినిమా టాక్ ని బట్టి కలెక్షన్స్ లో కొంచెం తేడాలు రావొచ్చు. అలాగే రెండు రోజుల్లో మహానుభావుడు కూడా రిలీజ్ కానుంది. ఇప్పటివరకు జై లవకుశ మంచి కలెక్షన్స్ ను రాబట్టింది.

,  ,  ,  ,