Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Feb-2017 14:51:42
facebook Twitter Googleplus
Photo

ప్రాక్టికల్ గా పట్టాల మీదకు వస్తుందో లేదో కానీ.. ఒక మెగా మూవీ గురించి ఇటీవల కాలంలో జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. మెగాస్టార్ కమ్ బ్యాక్ మూవీ ఖైదీ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ కు హాజరైన టి సుబ్బిరామిరెడ్డి తాను మెగాస్టార్ తోనూ.. పవర్ స్టార్ తోనూ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ప్రస్తుతం అన్నదమ్ముల మధ్యనున్న పరిస్థితుల్లో ఇలాంటివి వర్క్ వుట్ అయ్యేనా అన్న సందేహాలకు పుల్ స్టాప్ పెడుతూ.. ఖైదీ రిలీజ్ అయ్యాక ఏర్పాటు చేసిన అభినందన సభలోనూ ఇలాంటి ప్రకటనే చేశారు.

దీంతో.. సుబ్బిరామిరెడ్డి మాటల మీద జనాలు కాస్త ఫోకస్ చేశారు. ఇదిలా ఉంటే.. ఈ మధ్యన ఒక ప్రముఖ పీఆర్వో చేత ఈ మెగా సినిమాకు సంబంధించిన ఒక ప్రెస్ నోట్ ను రిలీజ్ చేయించారు సుబ్బిరామిరెడ్డి. అదే పనిగా మెగాస్టార్.. పవర్ స్టార్ సినిమా మీద వస్తున్న ప్రకటనలతో.. ఈ సినిమా వర్క్ వుట్ అవుతుందా? అసలీ ప్రాజెక్టు సాధ్యమేనా? అన్న సందేహాలు వెల్లువెత్తుతున్న పరిస్థితి.

మెగాస్టార్.. పవర్ స్టార్ లకు ఇప్పటికిప్పుడు ఉన్న కమిట్ మెంట్ల నేపథ్యంలో వారిద్దరి సినిమా ఇప్పటికిప్పుడు సాధ్యం కాదనే మాట వినిపిస్తున్న వేళ.. ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర ముచ్చట ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. ప్రముఖ దర్శఖుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చిరు.. పవన్ ల మెగా మూవీ రానుందని.. ఈ సినిమాకు సంబంధించిన రెమ్యునరేషన్ మీద లెక్కలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ సినిమా సెట్స్ మీదకు వెళితే చిరుకు రూ.25కోట్లు.. పవన్ కు రూ.25కోట్లు.. త్రివిక్రమ్ కు రూ.15కోట్లు రెమ్యునరేషన్ గా ఇవ్వాల్సి ఉంటుందని లెక్కేస్తున్నారు.అంటే.. రెమ్యునరేషన్లే రూ.65 కోట్లు అయితే.. సినిమా బడ్జెట్ ఎంతన్నది ఇప్పుడు మరో సందేహంగా మారింది. మాటల్లో జోరుగా వినిపిస్తున్న ఈ మెగా మూవీకి సంబంధించి రానున్న రోజుల్లో మరెన్ని మాటలు వినిపిస్తాయో..?

,  ,  ,  ,  ,  ,  ,