Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Jun-2016 12:45:30
facebook Twitter Googleplus
Photo

సినిమా విడుదల కంటే పాటల విడుదల వేడుకనే ఎక్కువగా ఆస్వాదిస్తుంటారు కథానాయకులు. అభిమానుల హంగామా అంతా ఆ రోజే కాబట్టి ఆడియో రిలీజ్ కోసం ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తుంటారు. అదొక పండగలా భావిస్తుంటారు. జనతా గ్యారేజ్ పాటల విడుదల వేడుక విషయంలోనూ ఎన్టీఆర్ అలాగే ఎదురు చూస్తున్నారు. నాన్నకు ప్రేమతోలాంటి సక్సెస్ తర్వాత చేస్తున్న చిత్రం కావడంతో జనతా గ్యారేజ్ కి మరింత క్రేజ్ ఏర్పడింది. అభిమానులు ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే సినిమా ఉంటుందని ఎన్టీఆర్ నమ్మకంగా చెబుతున్నాడు. అభిమానుల్ని పిలిపించుకొని మరీ సినిమా గురించి చెబుతున్నాడాయన.

తాజాగా ఆడియో రిలీజ్ డేట్ ని కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం. జులై 23న పాటల్ని విడుదల చేయాలని డిసైడైయ్యాడట. ఆగస్టు 12న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. పనులన్నీ అనుకొన్నట్టుగానే చకచక జరిగిపోతుండటంతో సినిమా విడుదల విషయంలో క్లారిటీగా ఉంది చిత్రబృందం. అందుకే ఆడియో రిలీజ్ డేట్ ని కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి హ్యాట్రిక్ పై కన్నేయాలనుకొంటున్నాడు ఎన్టీఆర్. మాస్ లో విపరీతమైన అభిమాన గణాన్ని సొంతం చేసుకొన్న ఎన్టీఆర్ లాంటి కథానాయకుడు వరుసగా రెండు హిట్లు కొట్టాడంటే క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోతుంది.

,  ,  ,  ,  ,  ,  ,