Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Nov-2016 11:45:56
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ లో ప్రామిసింగ్ గా కనిపిస్తున్న కొత్త కమెడియన్లలో ప్రవీణ్ మంచి స్పీడ్ మీద ఉన్నాడు. వరుస సినిమాలు చూస్తూ పేరుతో పాటు గుర్తింపు కూడా సంపాదించేస్తున్నాడు. ప్రస్తుతం జయమ్ము నిశ్చయమ్మురా మూవీలో ప్రవీణ్ కీలక పాత్రలో నటిస్తుండగా.. ఈ పాత్ర పేరు తత్కాల్. ఈ రోల్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ని ఇప్పుడు రిలీజ్ చేశారు.

కమెడియన్ హీరో సునీల్ చేతుల మీదుగా తత్కాల్ పాత్ర ఫస్ట్ లుక్ ను లాంఛ్ చేశారు. మున్సిపల్ ఆఫీస్ లో పని చేసే తత్కాల్.. 'మీ పనే నా మనీ' అంటూ ఉంటాడట. జయమ్ము నిశ్చయమ్మురా మూవీ తర్వాత.. తత్కాల్ అనేది ప్రవీణ్ కి ఇంటిపేరు అయిపోతుందని.. తత్కాల్ ప్రవీణ్ గా అందరూ పిలుస్తారని అంటున్నాడు సునీల్. ఈ మూవీలో తత్కాల్ పాత్ర చాలా కీలకం అని.. కథను పరుగులు పెట్టించే రోల్ అని చెప్పాడు జయమ్ము నిశ్చయమ్మురా చిత్రంలో హీరోగా నటిస్తున్న శ్రీనివాస రెడ్డి.

నవంబర్ 17న విడుదల కానున్న ఈ చిత్రంలో పూర్ణ హీరోయిన్ గా నటించగా.. ప్రవీణ్ తో పాటు పోసాని.. జీవాలు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ చూసిన దర్శకుడు సుకుమార్.. జయమ్ము నిశ్చయమ్మురా డైరెక్టర్ కి.. సుకుమార్ రైటింగ్స్ లో ఓ చిత్రానికి దర్శకత్వం చేసే ఛాన్స్ ఇవ్వడం.. ఈ మూవీపై ఆసక్తిని మరింతగా పెంచుతోంది.

,  ,  ,  ,  ,