Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-May-2016 12:07:57
facebook Twitter Googleplus
Photo

యంగ్ టైగర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న జనతా గ్యారేజ్ మూవీపై ఆసక్తి చాలానే ఉంది. రీసెంట్ గా జూనియర్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన లోగో - ఫస్ట్ లుక్ లకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. లుక్ పరంగా ఈ నందమూరి హీరో అదరగొట్టేశాడు. అయితే.. మే 28న సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టీజర్ విడుదల చేస్తారనే టాక్ వచ్చింది.

ఇప్పుడీ రూమర్లకు చెక్ పెట్టేసింది జనతా గ్యారేజ్ యూనిట్. మే 28న టీజర్ విడుదల చేసే ఆలోచన లేదని చెప్పేసింది. ప్రస్తుతం చెన్నైలోని బిన్నీ మిల్స్ లో భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ జరుపుకుంటుండగా.. అసలు టీజర్ ఆలోచన యూనిట్ లో ఎవరూ చేయలేదని చెప్పేసింది జనతా గ్యారేజ్ యూనిట్. ఈ మూవీ విషయంలో హీరో - డైరెక్టర్ ల దగ్గర పూర్తి క్లారిటీ ఉందని.. అన్నిటినీ పక్కా ప్లానింగ్ ప్రకారమే జరుపుతారని కూడా చెప్పేశారు. దీంతో పాటు టీజర్ రిలీజ్ చేయకపోవడంలో మరో అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నారట.

'జూనియర్ పుట్టిన రోజున ఫస్ట్ లుక్ ఇచ్చి సీనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజున టీజర్ ఇస్తే.. ఉద్దేశ్యపూర్వకంగా నందమూరి బాలకృష్ణను నిర్లక్ష్యం చేసినట్లు అవుతుంది. ప్రస్తుతం నందమూరి అభిమానులను డిస్టర్బ్ చేసే ఉద్దేశ్యం ఎన్టీఆర్ కి లేదు.' అని చెబుతున్నారు ఎన్టీఆర్ సన్నిహితులు

,  ,  ,  ,  ,  ,