Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Jul-2016 12:42:27
facebook Twitter Googleplus
Photo

గతంలో.. సినిమా రిలీజ్ అయిన తరువాత ఎన్ని థియేటర్లలో రిలీజ్ అయ్యింది, ఎన్ని రోజులు ఆడింది, ఎంత కలెక్ట్ చేసింది అన్న రికార్డ్లను లెక్కలేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. స్టార్ హీరోల సినిమాలు రిలీజ్కు ముందు నుంచే సత్తా చాటుతున్నాయి. ప్రీ రిలీజ్ బిజిసెస్ నుంచి ఫస్ట్ లుక్, టీజర్, థియట్రికల్ ట్రైలర్ల వ్యూస్ లాంటి విషయాల్లో కూడా రికార్డుల మీద రికార్డ్లు నమోదవుతున్నాయి. ఫ్యాన్స్ కూడా తన అభిమాన నటుల స్టామినాను ఈ రికార్డ్లతోనే అంచనా వేసుకుంటున్నారు.

తాజాగా ఎన్టీఆర్ తన తాజా చిత్రం జనతా గ్యారేజ్తో రికార్డ్ల వేట మొదలెట్టేశాడు. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్లో సత్తా చాటుతున్న జనతా గ్యారేజ్, తాజాగా రిలీజ్ అయిన టీజర్తో మరోసారి సత్తా చాటింది. గతంలో సర్దార్ గబ్బర్సింగ్ టీజర్ రిలీజ్ అయిన సమయంలో 24 గంటల్లో 41 వేల లైక్స్తో సత్తా చాటింది. అయితే ఎన్టీఆర్.. జనతా గ్యారేజ్ ఆ రికార్డ్ను బ్రేక్ చేస్తూ కేవలం 100 నిమిషాల్లోనే 40 వేలకు పైగా లైక్స్ సాధించి సరికొత్త రికార్డ్ను సాధించింది. అంతేకాదు 15 గంటల్లోనే 10 లక్షల పైగా వ్యూస్ సాధించింది జనతా గ్యారేజ్. తొలి టీజర్తోనే మొదలెట్టేసిన జూనియర్ ముందు ముందు ఇంకెన్ని రికార్డ్స్ నమోదు చేస్తాడో చూడాలి.

శ్రీమంతుడు సినిమాతో ఇండస్ట్రీ హిట్ సాధించిన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ సరసన సమంత నిత్యామీనన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టు 12న ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగుతో పాటు మళయాలంలోనూ ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు.

,  ,  ,  ,