Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Apr-2016 13:01:17
facebook Twitter Googleplus
Photo

సరైనోడు విడుదలై మూడు రోజులు దాటిపోయింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది. మొదటి రోజు మిక్స్ డ్ టాక్ వచ్చినా... బాక్సాఫీస్ మీద దాని ప్రభావం ఏమాత్రం పడలేదు. ఇప్పటికే ఓవర్సీస్ లో అర మిలియన్ డాలర్లను వసూలు చేసి బోయపాటి కెరీర్ లోనే హయ్యస్ట్ కలెక్ట్ చేసిన మూవీగా సరైనోడు నిలిచింది. అంతేనా... రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బాక్సాఫీస్ ను బద్దలు కొడుతోంది. బన్నీ కెరీర్ లో ఇంతకు ముందెన్నడూ లేని వసూళ్లను సాధిస్తోంది. దాంతో చిత్ర యూనిట్ చాలా ఆనందంగా వుంది. దాంతోనే ఈ రోజు సాయంత్రం ఓ స్టార్ హోటల్లో సక్సెస్ మీట్ తో పాటు... కాక్ టైల్ విందును కూడా ఏర్పాటు చేసిందట గీతాఆర్ట్స్. మొదటి రోజు కేవలం మాస్ కి మాత్రమే సరిపోయే సినిమా అని మూవీ క్రిటిక్స్ విశ్లేషించగానే.. చిత్ర యూనిట్ కాస్త కంగారు పడినా... మల్టీప్లెక్స్ ల్లో కూడా టిక్కెట్స్ బాగా తెగుతుండటంతో క్లాస్ పీపుల్స్ కూడా సినిమా ఎక్కేసిందని బోయపాటి అంటున్నారు. నేడు దర్శకుడు బోయపాటి శ్రీను పుట్టిన రోజు. తన సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుండటంతో చాలా హ్యాపీగా వుందంటున్నాడు.

ఇంకా సినిమా విషయాలు చెబుతూ ?కష్టానికి ఫలితం దక్కింది. బన్నిబాబును తెరమీద తన అభిమానులకు ఎలా చూపించాలో అలా చూపించి సక్సెస్ అయ్యా అనుకుంటున్నా. యాక్షన్ సీన్స్ తో పాటు సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ వున్నాయి. ఇందులో ప్రతి సీను సమాజంలో జరిగిన ఏదో ఓ సంఘటన నుంచి ఇన్ స్పిరేషన్ పొందినదే. ఇందులో వున్న మానస అనే కాలేజీ విద్యార్థిని క్యారెక్టర్ ను అయేషా హ్యత్యోదంతాన్ని దృష్టిలో వుంచుకుని రాసుకున్నదే. అంత కిరాతకంగా ఆమె మరణానికి కారణమైన వాడికి ఎలాంటి శిక్ష అయితే బాగుంటుందో అలాంటి శిక్షనే ఇందులో హీరో వేశారు. దానికి మంచి స్పందన వస్తోంది. ఆ సీనును పబ్ లో చిత్రీకరించడం కూడా చాలా బాగా కనెక్ట్ అయింది. బన్ని స్కేటింగ్ చేస్తూ.. తన ఎనర్జీ లెవెల్స్ తో ఆ ఫైట్ కి మరింత వన్నె తెచ్చాడన్నారు. ఇందులో వాలెంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నఐ.ఎ.ఎస్. అధికారి జయప్రకాష్ పాత్రలో సాయికుమార్ నటించాడు. పేదల కోసం పాటు పడే ఓ నీతి నిజాయతీ గల ఐ.ఎ.ఎస్.గా ఆయన పాత్రను తీర్చిదిద్దడానికి ఇన్ స్పిరేషన్ లోక్ సత్తా అధినేత జేపీగారి జీవితమే అన్నారు. అలాగే హీరో పెళ్లిచూపుల సమయంలో అన్నపూర్ణమ్మ.. హీరోయిన్ ను అటు ఇటు తరిగమనడం.. జుట్టు ఒరిజినల్లేగా.. కాళ్లు వంకర లేవుగా అని ప్రశ్నించడం కూడా తాను గతంలో ఓ పెళ్లి చూపులో చూసిన సంఘటన ఆధారంగానే రాసుకున్నా అన్నారు.

ఈ సినిమాను చిరంజీవి చూసి... ప్రతి సీను గురించి ఆయన వివరిస్తూ... నన్ను అభినందించారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ లో రకుల్ ప్రీత్ సింగ్.. అలా తిండి తిప్పలు లేకుండా నాలుగు రోజుల పాటు గణ కోసమే వచ్చానని చెప్పే సీను చూసినప్పుడైతే కళ్లలో నీళ్లు తిరిగాయని చెప్పారు. మొదట ఆది పినిశెట్టి క్యారెక్టర్ కు బాలీవుడ్ నటులు వివేక్ ఒబెరాయ్ ను మాధవన్ ను అనుకున్నాం అన్నారు. అయితే మాధవన్ చాలా బిజీగా వుండటంతో కుదరలేదు. వివేక్ ఒబెరాయ్ నటిస్తా అన్నాడు కానీ... మాకు కావాల్సిన సమయంలో కాల్షీట్స్ కుదరలేదు. మరో ప్రత్యామ్నాయం కోసం చూశాం. అప్పుడే ఆది పినిశెట్టి గుర్తొచ్చి... ఆయన్ను సంప్రదించగానే ఒప్పేసుకున్నారు. అలాగే అంజలి నటించిన ఐటెం సాంగులో కూడా మొదట అనుష్కను అనుకున్నాం. అది కూడా కుదరలేదు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాపైనే నా దృష్టి. సాధ్యమైనంత వరకు ఏడాదికి ఓ సినిమా చేయడానికి ట్రై చేస్తా. క్వాలిటీ కోసమే కొంత లేట్ అవుతోంది. త్వరత్వరగా సినిమా తీస్తే నా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది తప్ప... సినిమాలో క్వాలిటీ వుండదనేది నా అభిప్రాయం. కానీ.. ఏడాదికొకటి తీయడానికి ట్రై చేస్తా అన్నారు. బాలయ్య బాబుతో కచ్చితంగా సినిమా వుంటుంది. అది రాబోయే సార్వత్రిక ఎన్నికల ముందు వుండొచ్చు అన్నారు. బాలయ్య వందో సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ తనకు రాకపోవడం కాస్త నిరాశే కలిగించింది అన్నారు.

,  ,  ,  ,  ,  ,