Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-Jul-2017 11:09:58
facebook Twitter Googleplus
Photo

తమిళ బిగ్ బాస్ షోకు తగినంత ఆదరణ లభించకపోవడంతో తెలుగు బిగ్ బాస్ ఎలా ఉంటుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. అందులోనూ తెలుగు బిగ్ బాస్ షోలో పెద్దగా సెలబ్రిటీలు ఎవరూ లేకపోవడంతో ఈ షోకు వీక్ డేస్ లో అంతంత మాత్రంగానే టీఆర్పీలు వస్తున్నాయి. కానీ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వస్తున్న వీకెండ్స్ లో మాత్రం ఆ షోకు టీఆర్పీలు పెరిగిపోతున్నాయి. హోస్ట్ గా ఎన్టీఆర్ దుమ్ముదులిపేస్తుండడంతో వీకెండ్స్ లో షోకు క్రేజ్ వచ్చింది. ఎన్టీఆర్ హోస్టింగ్ కు నాగార్జునా కూడా ఫిదా అయిపోయిన సంగతి తెలిసిందే.

శనివారం బిగ్ బాస్ హౌస్ షో చాలా ఇంటరెస్టింగ్ గా సాగింది. గతంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ క్రిటిక్ కత్తి మహేష్ తాను చికెన్ సూపర్ గా వండుతానని చెప్పాడు. ఈ విషయాన్ని గుర్తు చేసిన ఎన్టీఆర్ మహేష్ ను చికెన్ వండమన్నాడు.20 రోజులుగా షూటింగ్ కోసం పుణెలో ఉన్నానని నాలుక చప్పబడిపోయిందని చెప్పాడు. ఆ చికెన్ ను బిగ్ బాస్ హౌస్ మేట్స్ కు కూడా వడ్డించాలని టాస్క్ ఇచ్చాడు.

కత్తి మహేష్ కు సహాయంగా కత్తి కార్తీకను పంపాడు ఎన్టీఆర్. వీరిద్దరూ వండిన చికెన్ ఎన్టీఆర్ కు తెగ నచ్చేసింది. తన హోస్ట్ చేస్తున్న చోటే కింద కిందకూర్చుని చికెన్ లాగించేశాడు ఎన్టీఆర్. కత్తి మహేష్ చికెన్ కత్తిలా ఉందని తెగ పొగిడేశాడు. అంతేకాదు ఆ చికెన్ కు కత్తి చికెన్ అని పేరు పెట్టేశాడు. బొంగులో చికెన్ ఉన్నపుడు ...కత్తి చికెన్ ఉండదా అంటూ జోకులు పేల్చాడు.

,  ,  ,  ,  ,  ,