Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-Aug-2016 16:19:26
facebook Twitter Googleplus
Photo

ఎన్టీఆర్ ? కొరటాలల జనతా గ్యారేజ్ హంగామా మొదలైపోయింది. సెప్టెంబర్ 1న రిలీజ్ కానున్న ఈ చిత్రం బెనిఫిట్ షోల కోసం థియేటర్స్ రెడీ అవుతున్నాయి. మరోవైపు, చిత్ర బృందం ప్రమోషన్స్ ని పెంచేసింది. ముఖ్యంగా తెలుగు గ్యారేజ్ ప్రమోషన్స్ ని ఎన్ టీఆర్ బాధ్యత తీసుకొన్నట్టు కనబడుతోంది. వరుస పెట్టి అన్ని చానెల్స్ కి స్పెషల్ ఇంటర్వ్యూ లు ఇస్తూ వస్తున్నాడు తారక్. ఆయా ఇంటర్వ్యూలలో సినిమా, పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికరమైన విషయాలని చెబుతున్నారు తారక్.

ఎన్టీఆర్ ఇతర సినిమాలపై స్పందిస్తూ.. ఇటీవలే రిలీజైన సినిమాల్లో మ‌న‌మంతా, పెళ్లిచూపులు బాగా నచ్చాయన్నారు. తెలుగు సినిమాలో వ‌స్తున్న మార్పుకు ఈ సినిమాలే నిదర్శనమని చెప్పుకొచ్చారు తారక్. ఒకే త‌ర‌హా సినిమాలు చేస్తే ప్రేక్ష‌కుల నుంచి చెంప‌దెబ్బ‌లు ప‌డ‌తాయ‌న్నారు. మ‌న‌మేంటో నిరూపించుకోవాలంటే మంచి క‌థ‌లు ఎంచుకోవాలన్నారు.

,  ,  ,  ,  ,  ,  ,