Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Jun-2016 13:10:46
facebook Twitter Googleplus
Photo

ఒక మెగా హీరోతో పని చేసిన దర్శకుడు.. నందమూరి కుటుంబ కథానాయకుడితో సినిమా తీయబోతుంటేనే ఆశ్చర్యంగా చూస్తాం. అలాంటిది నందమూరి హీరో దగ్గర మేనేజర్ గా పనిచేసిన వ్యక్తి మెగా కుటుంబ కథానాయకుడితో సినిమాను నిర్మించబోతుండటం విశేషం. జూనియర్ ఎన్టీఆర్ దగ్గర ఇంతకుముందు మేనేజరుగా పని చేసిన కృష్ణ.. మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో సినిమాను ప్రొడ్యూస్ చేయబోతున్నాడు.

?వాంటెడ్? సినిమాతో దర్శకుడిగా పరిచయమై ఆ సినిమా డిజాస్టర్ కావడంతో మళ్లీ మెగా ఫోన్ జోలికి వెళ్లని బి.వి.ఎస్.రవి.. ఎట్టకేలకు దర్శకుడిగా తన రెండో సినిమాకు రంగం సిద్ధం చేసుకున్నాడు. అతను సాయిధరమ్ హీరోగా సినిమా ఓకే చేయించుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్నే కృష్ణ నిర్మించబోతున్నాడు. హీరో హీరోయిన్ల దగ్గర మేనేజర్లుగా పని చేసిన వాళ్లు నిర్మాతలుగా మారడం కొత్తేం కాదు. ఐతే చాలా వరకు తాము పని చేసిన హీరోలతోనే సినిమాలు తీస్తుంటారు మేనేజర్లు. ఐతే ఎన్టీఆర్ తో చేయాలంటే బడ్జెట్ భారీగా ఉంటుంది. అందుకే మీడియం రేంజిలో సాయిధరమ్ తో సినిమా చేయబోతున్నాడు కృష్ణ.

ఇటీవలే ?సుప్రీమ్?తో కెరీర్ బెస్ట్ హిట్ కొట్టిన సాయిధరమ్.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాకు కమిటై ఉన్నాడు. దిల్ రాజు బేనర్లో ఇంకో సినిమా చేయాల్సి ఉంది. ఐతే గోపీచంద్ మలినేని సినిమా ఆలస్యం కావచ్చని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దాని కంటే ముందు బి.వి.ఎస్.రవితో సినిమాను మొదలుపెట్టేసినా పెట్టేయొచ్చు.

,  ,  ,  ,  ,  ,