Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-May-2017 15:07:09
facebook Twitter Googleplus
Photo

సంక్రాంతి సినిమాగా విడుదలయైనా శతామనం భవతి మంచి ఫ్యామిలి ఫిల్మ్ గా అందరినీ అలరించింది. ఈ సినిమాతో శర్వానంద్ కమర్షియల్ సక్సెస్ కూడా వచ్చింది. ఇప్పుడు టాలీవుడ్ లో చాలా ఖుషీ లో ఉన్న హీరోల్లో శర్వా కూడా ఒకడు. తన విజయంతో మరో రెండు సినిమాలతో బిజీ అయ్యాడు.

ఈ నెల 12న రాధ విడుదలకు అన్నీ సిద్దం చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రేమతో పాటు యాక్షన్ కూడా ఉంటుంది అని చెప్పుతున్నారు. ఇప్పటికే ఫ్యామిలి ప్రేక్షకులును ఆకట్టుకొన్న శర్వానంద్ ఇప్పుడు ఈ సినిమా విజయం పై నమ్మకంగానే ఉన్నాడు. ఇతడి తదుపరి సినిమాల విషయానికొస్తే.. డైరెక్టర్ దశరథ్ ఒక స్క్రిప్ట్ ని వినిపించాడట.. అది శర్వానంద్ కు నచ్చి చేద్దాం అని చెప్పాడట. దశరథ్ ఇప్పటికే ఫ్యామిలి కథలతో మంచి విజయాలనే అందుకున్నాడు కాని.. సంతోషం అండ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఇచ్చిన కిక్ ను చెత్త సినిమాలతో పాడు చేసుకున్నాడు. కాని ఇప్పుడు మాత్రం పక్కాగా రెడీ చేసిన ఫ్యామిలీ కథతోనే ఇరగదీస్తానంటున్నాడు. ఈసారి ఋతురాగాలు అనే టైటిల్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

ఏదేమైనా కూడా చాలా ఏళ్ల నుండి సినిమాలు తీస్తున్న దశరథ్ వినాయక్ శ్రీను వైట్ల వంటి సమకాలికులు ఇప్పటి జనాలకు నచ్చే రేంజులో సినిమాలను సృష్టించలేకపోతున్నారు.

,  ,  ,  ,  ,