Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Nov-2016 14:43:40
facebook Twitter Googleplus
Photo

జనతా గ్యారేజ్ రిలీజై రెండున్నర నెలలవుతోంది. ఇప్పటిదాకా జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ఏదో క్లారిటీ రాలేదు. ఈ రెండున్నర నెలల్లో వక్కంతం వంశీ మొదలుకుని దాదాపు అరడజను మంది పేర్లు వినిపించాయి. కానీ ఎవ్వరితోనూ సినిమా పట్టాలెక్కలేదు. ఫలానా దర్శకుడితో సినిమా ఫైనల్ అంటారు. వారం గడిచాక అదేమీ లేదని తేలిపోతుంది. చివరగా అనిల్ రావిపూడి పేరు వినిపించింది. కానీ ఆ తర్వాత చప్పుడు లేదు. ఇప్పుడు కొత్తగా ఇంకో పేరు తెరమీదికి వచ్చింది. ఆ పేరు కొంచెం ఆశ్చర్యం కలిగించేదే. తమిళంలో మాస్ మసాలా సినిమాలకు పెట్టింది పేరైన హరితో ఎన్టీఆర్ సినిమా చేస్తాడని అంటున్నారు.

?సింగం? సిరీస్ సహా తమిళంలో హరి చేసిన సినిమాలన్నీ ఊర మాసే. సింగం సిరీస్ తో పాటు ?సామి? లాంటి బ్లాక్ బస్టర్లు చాలానే ఉన్నాయి హరి కెరీర్లో. సూర్య లాంటి క్లాస్ హీరోను కూడా ఊర మాస్ గా ప్రెజెంట్ చేసి.. హిట్లు కొట్టిన ఘనత హరి సొంతం. ఇక ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోతో హరి సినిమా చేస్తే బాగానే ఉంటుంది. ఐతే ఎన్టీఆర్ ఇంతకు ముందులాగా మాస్ మసాలా సినిమాలు చేయట్లేదు. ఒకే ఛట్రంలో ఇరుక్కుపోకూడదని రూటు మార్చి.. కొంచెం క్లాస్ టచ్ ఉన్న సినిమాలు చేస్తూ వచ్చాడు. అవి అతడికి విజయాలందించడమే కాదు.. మిగతా వర్గాల్లో కూడా ఆదరణ పెంచాయి. ఐతే ఇప్పుడు కొంచెం రూటు మార్చి మళ్లీ ఓ మాస్ సినిమా చేస్తే బాగానే ఉంటుందని హరితో సినిమా చేయడానికి ఓకే అన్నాడేమో తెలియదు. చూద్దాం.. ఈ కాంబినేషన్ జస్ట్ రూమరా.. లేక నిజంగానే వాళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తారా?

,  ,  ,  ,  ,