Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Jan-2017 14:16:28
facebook Twitter Googleplus
Photo

సినిమా ఇండస్ట్రీలో సరైన హిట్ పడితే.. అనంతరం ఆ డైరెక్టర్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుంది. ఆ దర్శకుడితో సినిమాలు చేయాలని హీరోలంతా తపనపడిపోతుంటారు. ఈ క్రమంలో రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా తనదైన శైలిలో చిత్రాలు చేసుకుంటూ పోతున్న క్రిష్ కి తాజాగా ఆ డిమాండ్ ఏర్పడిందని అంటున్నారు. ఇప్పటికే తన టాలెంట్ ఏమిటో పలు సినిమాలతో నిరూపించుకున్న క్రిష్.. తాజా చిత్రం "గౌతమీపుత్ర శాతకర్ణితో" తన సినిమాల కమర్షియల్ రేంజ్ ఇదని నిరూపించుకున్నాడు. దీంతో ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చూపు క్రిష్ పై పడిందని అంటున్నారు.

తాజాగా యంగ్ టైగర్ కూడా బాబాయ్ కి సూపర్ హిట్ ఇచ్చిన క్రిష్ తో సినిమా చేయాలని అది కూడా చారిత్రక నేపథ్యం ఉన్న కథ అయితే బాగుంటుందని అనుకుంటున్నాడట. "గౌతమీపుత్ర శాతకర్ణి" అనంతరం క్రిష్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ వెంకటేష్ - చరణ్ లతో ఉండబోతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ తో కూడా క్రిష్ సినిమా చేయనున్నాడని అంటున్నారు. అయితే దీనికి జూనియర్ కూడా ఆసక్తిగా ఉన్నాడని వీలైనంత త్వరగా ఎన్టీఆర్ - క్రిష్ కాంబినేషన్ లో ఒక చారిత్రక చిత్రం తెరకెక్కనుందని అనుకోవచ్చు.

కాగా శాతకర్ణి అనంతరం ఈ టాలెంటెడ్ దర్శకుడితో సినిమా చేయాలని సీనియర్ హీరోలతో పాటు కుర్రహీరోలు కూడా క్రిష్ నామస్మరణ చేస్తున్నారని అంటున్నారు. ఇదే నిజమైతే క్రిష్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా సెన్షేషన్ల్ కాంబినేషన్స్ తో రావడమే కాదు సెన్షేషన్స్ క్రియేట్ చేస్తాయని అనుకోవచ్చు. ఈ లెక్కన అన్నీ అనుకూలంగా జరిగితే యంగ్ టైగర్ ని కూడా గుర్రం ఎక్కించి కిరీటం పెట్టించి పెద్దాయన రేంజ్ డైలాగులు బుడ్డోడితో కూడా చెప్పిస్తే... థియేటర్స్ మారుమ్రోగిపోతాయనడంలో సందేహం లేదు!

,  ,  ,  ,  ,  ,