Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Sep-2016 12:31:41
facebook Twitter Googleplus
Photo

ఆల్రెడీ తెలిసిన విషయమే. మరింత పక్కాగా చెప్పాడు వి.వి.వినాయక్. చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 పక్కాగా వచ్చే సంక్రాంతికే వస్తుందని వినాయక్ స్పష్టం చేశాడు. ఇంకా పిన్ పాయింటెడ్ గా.. భోగి రోజున..అంటే 2017 జనవరి 13న ?ఖైదీ నెంబర్ 150? రిలీజవుతుందని వినాయక్ వెల్లడించాడు.

రాజమండ్రి పుష్కర ఘాట్లోని విద్యా గణపతిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ వినాయక్ ఈ విషయం వెల్లడించాడు. చిరంజీవి రీఎంట్రీ మూవీ విషయంలో ప్రేక్షకుల అంచనాల్ని అందుకోవడానికి వంద శాతం కష్టపడుతున్నామని.. ఈ సినిమా చిరంజీవి అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులనూ ఆకట్టుకుంటుందని వినాయక్ ధీమా వ్యక్తం చేశాడు. ఇంకో నాలుగు నెలల్లో చిరంజీవిని వెండితెర చూసుకోవచ్చన్నమాట మెగా అభిమానులు.

ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తయినట్లుగా ?చిరు 150? యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సంక్రాంతి డెడ్ లైన్ అందుకోవాలన్న పట్టుదలతో చిరంజీవి విరామం లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. నవంబరుకల్లా టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుందని సమాచారం. ఈ చిత్రంలో చిరు సరసన కాజల్ కథానాయికగా నటిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నందిస్తున్నాడు. తమిళ బ్లాక్ బస్టర్ ?కత్తి?కి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రాన్ని చిరు తనయుడు రామ్ చరణే నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

,  ,  ,  ,  ,  ,  ,