Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Oct-2016 11:33:44
facebook Twitter Googleplus
Photo

యంగ్ టైగర్ ఇప్పుడేం చేస్తున్నాడు? ఎన్నాళ్ళని జనతా గ్యారేజ్ హిట్టు కిక్ ను ఎంజాయ్ చేస్తూ కాలం గడిపేస్తాడు? ఇక కొత్త సినిమాను మొదలెట్టడా? ఒక ప్రక్కన పూరి జగన్ తీసిన ఇజం సినిమా చూసిన తరువాత మనోడు అప్పుడే పూరి జగన్ తో పనిచేసే సీన్ లేదనే అనిపిస్తోంది. మరో ప్రక్కన రైటర్ వక్కంతం వంశీ రాసిన కథ నచ్చలేదంటున్నాడు. మరి మనోడితో పనిచేయడానికి రెడీగా ఉన్న డైరక్టర్ ఎవరు?

నిజానికి ఇప్పుడు స్టార్ డైరక్టర్లు అందరూ బిజీయే. పోనివ్ చిన్న చిన్న సినిమాలతో హిట్టులు కొట్టిన దర్శకులకు ఎన్టీఆర్ నుండి అవకాశం రావట్లేదాయే. అయితే డిసెంబర్ నెలతో ఫ్రీ అయిపోయే డైరక్టర్ ఒకరు ఉన్నారులే. ఎన్టీఆర్ కు గతంలో ఆది - సాంబ - అదుర్శ్ వంటి హిట్లను అందించిన వివి వినాయక్ త్వరలోనే ''ఖైదీ నెం 150'' సినిమా వర్కు మొత్తం పూర్తి చేయనున్నాడు. అందుకే ఆయన జనవరి నుండి తన కొత్త సినిమాను మొదలెట్టాలని చూస్తున్నాడు. అప్పటి వరకు బ్రేక్ తీసుకుని హ్యాపీగా ఎన్టీఆర్ అతనితోనే సినిమా చేస్తాడా మరి? అంటే.. అవుననే అంటున్నారు సన్నిహితులు.

గతంలో చాలాసార్లు ఎన్టీఆర్ అండ్ వివి వినాయక్ అదుర్శ్ 2 సినిమా తీస్తున్నారు అంటూ రూమర్లు వచ్చాయి. ఈ విషయంపై స్పందించిన వినాయక అప్పట్లో ఖచ్చితంగా సీక్వెల్ చేస్తాం అన్నాడు. కాని ఇంతవరకు ఎటువంటి క్లారిటీ లేదు. కాకపోతే ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ రెడీ అయినట్లు తెలుస్తోంది. చూద్దాం మరి.

,  ,  ,  ,