Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Jul-2016 11:56:37
facebook Twitter Googleplus
Photo

రజినీకాంత్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పేదేముంది. సామాన్యుల నుంచి సినీ, రాజకీయ ప్రముఖుల వరకు అందరూ ఆయన అభిమానులే. ఈ విషయం అందరికీ తెలుసు కాబట్టే.. పుదుచ్చేరి కలెక్టర్ ఓ సూపర్ ప్లాన్ వేశారు. రజినీకాంత్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని స్వచ్ఛ భారత్ లాంటి ప్రజాసేవల్లో పాల్గొన్న వారికి సూపర్ స్టార్ లేటెస్ట్ సినిమా ?కబాలి? టికెట్లు కానుకగా ఇస్తామని ప్రకటించేశారు.
ఈ ప్రకటనకు అంచనాలకు మించి సూపర్ రెస్పాన్స్ వచ్చిందట. ఈ విషయాన్ని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడి ట్విట్టర్ లో తెలియజేస్తూ.. సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఓ విజ్ఞప్తి చేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అభివృద్ధి కోసం రజినీకాంత్ ఈ ప్రాంతం బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని లెఫ్టినెంట్ గవర్నర్ హోదాలో ఉన్న కిరణ్ బేడి కోరారు. మరి ?కబాలి? రజినీ ఈ విజ్ఞప్తికి ఎలా స్పందిస్తారో చూడాలి.

,  ,  ,  ,  ,  ,  ,  ,