Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Feb-2017 10:00:44
facebook Twitter Googleplus
Photo

ఫిజిక్ విషయంలో ఎన్టీఆర్ పై ఈ మధ్య చాలానే వార్తలు వచ్చాయి. కొత్త సినిమా కోసం తగ్గిపోయేందుకు బాగా ట్రై చేస్తున్నాడని.. విపరీతంగా వర్కవుట్స్ చేస్తున్నాడని అన్నారు. నిజానికి గతంలో ఒళ్లు చేసిన జూనియర్.. టెంపర్ మూవీలో బాగానే కనిపించాడు. నాన్నకు ప్రేమతో చిత్రంలో కొంచెం ఒళ్లు చేసినట్లు అనిపించినా.. జనతా గ్యారేజ్ లో మాత్రం సైజ్ బాగా తేడా వచ్చేసింది.

ఆ తర్వాత ఏకంగా ఆరు నెలలు గ్యాప్ రావడంతో.. బాగా ఒళ్లు చేసేశాడు. ఇప్పుడు బాబీ దర్శకత్వంలో ప్రారంభం కానున్న కొత్త సినిమాలో ఏకంగా 3 పాత్రలు చేయనుండడంతో.. లుక్స్ లో వేరియేషన్ కోసం ట్రై చేస్తున్నాడని అన్నారు. అయితే.. ఇప్పుడు ఎన్టీఆర్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభమైపోయింది. జై లవకుశ వర్కింగ్ టైటిల్ పై ప్రారంభం కాగా.. ఈ మూవీ షూటింగ్ కు తనే తొలి క్లాప్ కొట్టాడు ఎన్టీఆర్.

ఈ ప్రారంభోత్సవంలో ఎన్టీఆర్ లుక్ చూస్తే.. సైజ్ విషయంలో ఎన్టీఆర్ యథాతథంగా ఉన్నాడనే విషయం అర్ధమవుతుంది. మరి లుక్ విషయంలో వచ్చిన వార్తలన్నీ ఇప్పుడు పుకార్లే అని తేలిపోయినట్లే!!

,  ,  ,  ,  ,