Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Aug-2015 12:36:50
facebook Twitter Googleplus
Photo

చేతిలో ఎన్ని సినిమాలున్నా సరే... మరో సినిమాకోసం ప్రయత్నిస్తుంటుంది రకుల్ ప్రీత్ సింగ్. కాల్షీట్లు కూడా భలే సర్దుబాటు చేస్తుంటుంది. యేడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తున్నప్పటికీ ఎక్కడా కాల్షీట్ల సమస్య రానీయలేదు. ఆమె మేనేజ్ మెంట్ ని చూసి సాటి హీరోయిన్లు సైతం అసూయపడేవాళ్లు. `మేం ఒకట్రెండు సినిమాలకే డేట్లు సర్దుబాటు చేయలేకున్నాం రకుల్ అన్ని సినిమాలు ఎలా చేస్తుందబ్బా?` అని ఆశ్చర్యపోయేవాళ్లు. అదృష్టమేమిటంటే... రకుల్ చేసిన సినిమాలకి షూటింగ్ మధ్యలో ఎలాంటి అంతరాయం తలెత్తలేదు. దీంతో ఆమె చకచకా సినిమాలు చేసుకొంటూ వెళ్లిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే రకుల్కి కాల్షీట్ల కాక మొదలైనట్టు తెలుస్తోంది.

రామ్ చరణ్ ఎన్టీఆర్ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ మహేష్ తో కలిసి `బ్రహ్మోత్సవం`లో నటించాలని ఆశపడింది. కానీ చివరి నిమిషంలో డేట్లు సర్దుబాటు చేయలేక ఆ సినిమాని వదులుకొంది. మహేష్ సినిమా చేజారిపోవడం రకుల్ కి రుచించలేదో ఏమో మళ్లీ వెంటనే అల్లు అర్జున్ సినిమాలో నటించేందుకు ఒప్పుకొంది. ఒప్పుకోవడమైతే ఒప్పుకొంది కానీ డేట్ల సర్దుబాటు చేయలేక ఇప్పుడు నానా తంటాలు పడుతోందట. ఎన్టీఆర్ సినిమా లండన్ లో చిత్రీకరణ జరుగుతోంది. రామ్ చరణ్ సినిమానేమో బ్యాంకాక్ హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకొంటోంది. ఆ రెండు సినిమాలకే సమయం కేటాయించలేని పరిస్థితి. ఇంతలో అల్లు అర్జున్ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఇప్పుడేం చేయాలా అని రకుల్ తల పట్టుకొంటోందట. ఇక చేసేదేం లేక బన్నీసినిమా సెట్లోకి ఇప్పట్లో రానని చెప్పిందట రకుల్. మరో నెల రోజుల తర్వాతే నా పార్ట్ షూటింగ్ పెట్టుకోండని చెప్పిందట. అందుకే ఇప్పుడు కేవలం బన్నీ ఇతర చిత్రబృందంపైనే సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.

,  ,